News April 5, 2025
సీఎం చంద్రబాబు ముప్పాళ్లలో శంకుస్థాపన చేసిన పనుల వివరాలివే(2/2)

నేడు సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని గురుకులాలు, SC హాస్టళ్లలో స్వచ్ఛ భారత్ మిషన్(గ్రామీణ్) కింద కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లకై రూ.58.14 కోట్లతో చేపట్టనున్న 1,938 పనులకు, అలాగే 153 ప్రభుత్వ విద్యాసంస్థలలో రూ.5.18 కోట్లతో PM- AJAY పథకం కింద ఆర్‌వో ప్లాంట్ల ద్వారా తాగునీటి సరఫరా పనులకు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఆయన జిల్లా ప్రజాప్రతినిధుల సమక్షంలో శంకుస్థాపన చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు.
Similar News
News April 7, 2025
పార్వతీపురం జిల్లాలో నకిలీ పోలీస్ అరెస్ట్

పోలీసునంటూ పలువురి వద్ద డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిని పాలకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడ్ని సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాంబాబు మాట్లాడుతూ.. ఎస్‌ఐ అబ్బాయి ఆస్పత్రిలో ఉన్నారని, డబ్బు పంపించాలని వీరఘట్టంలో పలువులు వర్తకులకు ఫోన్ చేసిన వ్యక్తిని సాంకేతిక పరిజ్ఞానంతో బాపట్లలో పట్టుకున్నామన్నారు. సీఐ చంద్రమౌలి, ఎస్‌ఐలు ప్రయోగమూర్తి, కళాధర్ తదితరులు పాల్గొన్నారు.
News April 7, 2025
నాగులకుంట ప్రభుత్వ భూమి ఆక్రమణపై కలెక్టర్‌కు ఫిర్యాదు

అమరచింత మున్సిపాలిటీ పరిధిలోని నాగులకుంట ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకొని పామ్ ఆయిల్, తోటల పెంపకాన్ని చేపట్టారంటూ సోమవారం వనపర్తి జిల్లా కలెక్టరేట్‌లో నాగులకుంట రైతులు ఫిర్యాదు చేశారు. గతనెల మార్చి 17న ఈ విషయంపై కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు లేవని రైతులు ఆరోపించారు. నాగులకుంటను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభికి ప్రజావాణిలో వినతిపత్రం అందించారు.
News April 7, 2025
వనపర్తిలో BRS రజతోత్సవ సభపై సన్నాహక సమావేశం

వనపర్తి మండలం రాజపేట సమీపంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీసులో రజతోత్సవ సభ సన్నాహక సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. వనపర్తి నుంచి భారీగా తరలివచ్చి రజతోత్సవ సభను విజయవంతం చేయాలన్నారు. వనపర్తి పట్టణ అధ్యక్షుడు రమేశ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి, నేతలు పాల్గొన్నారు.