News April 5, 2025
నష్టం లేకుండా కంచ భూముల వివాదానికి పరిష్కారం: మీనాక్షి

TG: గచ్చిబౌలి కంచ భూముల అంశంపై కమిటీ వేసినట్లు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వెల్లడించారు. ప్రజా సంఘాలు, పర్యావరణ వేత్తలతో కూడిన ఈ కమిటీ అందరి వాదనలు పూర్తిస్థాయిలో వింటుందని చెప్పారు. భూములపై ఏం చేయాలనేది తర్వాత నిర్ణయిస్తామని, ఎవరికీ నష్టం కలగకుండా వివాదం పరిష్కరిస్తామన్నారు. విద్యార్థుల లేఖలు, ప్రతిపక్షాల ఆరోపణలపై ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని ఆమె చెప్పారు.
Similar News
News April 7, 2025
ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట

AP: మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట దక్కింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆయనను అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా లిక్కర్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కావాలని మిథున్ రెడ్డి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
News April 7, 2025
చెప్పులు దాస్తే ₹5వేలే ఇచ్చాడని వరుడిపై కర్రలతో దాడి..

కొన్ని ప్రాంతాల్లో వివాహాల్లో వరుడి చెప్పులను దాచి కట్నం తీసుకోవడం ఆచారం. UP బిజ్నోర్‌లో ఓ వరుడిని ₹50వేలు డిమాండ్ చేశారు. అతడు ₹5వేలు ఇవ్వడంతో గొడవ జరిగింది. తక్కువ డబ్బు ఇచ్చినందుకు వధువు వైపు మహిళలు వరుడిని ‘బిచ్చగాడు’ అని తిట్టడంతో ఇరు కుటుంబాలు దాడి చేసుకున్నాయి. దీంతో వధువు కుటుంబం (బావమరుదులు) వరుడిని రూమ్‌లో బంధించి కర్రలతో కొట్టింది. పోలీసుల జోక్యంతో ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిరింది.
News April 7, 2025
చిరు వ్యాపారులను కొల్లగొడుతున్న క్విక్ కామర్స్!

నగరాల్లో వేగంగా విస్తరిస్తున్న క్విక్ కామర్స్ సంస్థలు సంప్రదాయ చిరు వ్యాపారుల పొట్టకొడుతున్నాయి. ఈ పది నిమిషాల డెలివరీ సంస్థలు భారీ దేశీ, విదేశీ పెట్టుబడులతో ఆఫర్లు, అర్ధరాత్రి తర్వాతా సేవలు అందిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. దీంతో చాలా మంది ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. ఇదే కొనసాగితే వచ్చే ఐదేళ్లలో నగర వీధుల్లో కిరాణా, కూరగాయల, పండ్ల దుకాణాలు కనుమరుగవ్వొచ్చు.