News April 5, 2025

పల్నాడు జిల్లా టుడే టాప్ న్యూస్

image

☞ నరసరావుపేట: బాబు జగ్జీవన్ రామ్‌కు నివాళులర్పించిన కలెక్టర్, ఎస్పీ, ☞ రాజుపాలెం: రోడ్డు ప్రమాదంలో మహిళ తలకు గాయాలు, ☞ గురజాల: అధికార పార్టీపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ ఫైర్, ☞ మాచర్ల: ఎంపీటీసీ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి పరామర్శ, ☞ చిలకలూరిపేట: యువకుడి ఆత్మహత్య, ☞ దుర్గి: నాటు సారా తయారీ అనర్ధాలపై అవగాహన కల్పించిన అధికారులు, ☞ శావల్యాపురం: అక్రమ మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్. 

Similar News

News April 7, 2025

రూ.4,00,000.. వారం రోజులే గడువు

image

TG: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటివరకు 9 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. వారం రోజుల్లో గడువు ముగియనుండగా మొత్తంగా 20 లక్షల అప్లికేషన్లు వస్తాయని అంచనా. మే 31లోగా అర్హులను స్క్రీనింగ్ చేసి కలెక్టర్ల ఆమోదానికి అధికారులు పంపనున్నారు. జూన్ 2న అర్హులకు రుణాలు మంజూరు చేయనున్నారు. లబ్ధిదారులకు గరిష్ఠంగా రూ.4 లక్షల సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

News April 7, 2025

డీలిమిటేషన్‌తో దక్షిణాదికి తీవ్ర అన్యాయం: టీపీసీసీ చీఫ్

image

TG: మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ తీరు ఫెడరల్, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ ఆరోపించారు. డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కుటుంబ నియంత్రణ ఆదేశాలను ధిక్కరించిన రాష్ట్రాలకు డీలిమిటేషన్‌తో లబ్ధి చేకూరుతుందన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ కోదండరాంతో కలిసి నడుస్తామని స్పష్టం చేశారు.

News April 7, 2025

ఒంటిమిట్టలో మంత్రుల పర్యటన

image

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో ఆదివారం నుంచి ప్రారంభమైన కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సోమవారం రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, సవిత, ఆనం, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, బీద రవిచంద్ర పర్యవేక్షించారు. ముందుగా కోదండ రామస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 

error: Content is protected !!