News April 5, 2025
PBKSvsRR: పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

PBKSతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 205/4 స్కోర్ చేసింది. జైస్వాల్ 67, శాంసన్ 38, రియాన్ పరాగ్ 43*, నితీశ్ రాణా 12, హెట్‌మయర్ 20 పరుగులు చేశారు. ఫెర్గ్యూసన్ 2, మార్కో జాన్‌సెన్, అర్ష్‌దీప్ చెరో వికెట్ తీశారు. విజయం కోసం పంజాబ్ 206 రన్స్ చేయాలి.
Similar News
News April 7, 2025
గిరిజన యువత గంజాయి సాగు వదిలేయాలి: పవన్ కళ్యాణ్

AP: మన్యం ప్రాంతాల్లో రహదారి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. గత ప్రభుత్వం ఇక్కడ రోడ్ల కోసం రూ.92 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. అల్లూరి జిల్లా పెదపాడు సభలో మాట్లాడుతూ ఇక్కడ తమకు ఓట్లు పడకపోయినా రూ.1,005 కోట్లతో రహదారులు నిర్మిస్తున్నామని చెప్పారు. గిరిజన యువత గంజాయి సాగు వదిలి టూరిజం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
News April 7, 2025
రూ.4,00,000.. వారం రోజులే గడువు

TG: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటివరకు 9 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. వారం రోజుల్లో గడువు ముగియనుండగా మొత్తంగా 20 లక్షల అప్లికేషన్లు వస్తాయని అంచనా. మే 31లోగా అర్హులను స్క్రీనింగ్ చేసి కలెక్టర్ల ఆమోదానికి అధికారులు పంపనున్నారు. జూన్ 2న అర్హులకు రుణాలు మంజూరు చేయనున్నారు. లబ్ధిదారులకు గరిష్ఠంగా రూ.4 లక్షల సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
News April 7, 2025
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి తీవ్ర అన్యాయం: టీపీసీసీ చీఫ్

TG: మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ తీరు ఫెడరల్, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ ఆరోపించారు. డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కుటుంబ నియంత్రణ ఆదేశాలను ధిక్కరించిన రాష్ట్రాలకు డీలిమిటేషన్‌తో లబ్ధి చేకూరుతుందన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ కోదండరాంతో కలిసి నడుస్తామని స్పష్టం చేశారు.