News April 5, 2025
హత్తుకునే కథతో 7/G సీక్వెల్: సెల్వ రాఘవన్

7/G బృందావన్ కాలనీ సీక్వెల్ షూట్ 50% పూర్తయ్యిందని డైరెక్టర్ సెల్వ రాఘవన్ వెల్లడించారు. మనసును హత్తుకునే కథతో రెడీ చేస్తున్నామన్నారు. హీరోయిన్ చనిపోయాక హీరో(రవికృష్ణ) జీవితం ఎలా సాగిందనే అంశాలతో రూపొందిస్తున్నట్లు తెలిపారు. ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్‌పై మాట్లాడుతూ ‘ఇది క్లిష్టమైన కథ. భారీగా ఖర్చవుతుంది. నిర్మాత కోసం చూస్తున్నాం. ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తారు. కార్తి కూడా ఉంటారు’ అని చెప్పారు.
Similar News
News April 7, 2025
బిల్ గేట్స్ పిల్లలకిచ్చే ఆస్తి ఎంతో తెలుసా?

తన ఆస్తిలో 1శాతం లోపే తన కుటుంబానికి ఇవ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్‌గేట్స్ తెలిపారు. వారు వారసత్వంగా వచ్చిన ఆస్తి ద్వారా కాకుండా స్వతంత్రంగా పైకి రావడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓపాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థను నడపమని వారిని కోరనని, వారికి నచ్చిన రంగాన్ని ఎంచుకుని అందులో రాణించడమే తనకి ఇష్టమన్నారు. బిల్‌గేట్స్ మెుత్తం సంపద 155బిలియన్ డాలర్లు.
News April 7, 2025
RARE: గోల్డెన్ టైగర్‌ను చూశారా?

అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కులో అరుదైన గోల్డెన్ టైగర్ కనిపించింది. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ సుధీర్ శివరామ్ బంగారు వర్ణపు పులి ఫొటోలను తన కెమెరాలో బంధించారు. సూడోమెలనిజం అనే అరుదైన జన్యు మార్పు కారణంగా ఇవి బంగారు-నారింజ రంగులో ఉంటాయని పశుసంరక్షణ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటివి చాలా అరుదని, ఎక్కడో ఓ చోట మాత్రమే కనిపిస్తాయని తెలిపారు.
News April 7, 2025
ఇవి ఎక్కువ తినకండి: సీఎం చంద్రబాబు

AP: చెడు ఆహారపు అలవాట్ల వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని CM చంద్రబాబు తెలిపారు. చాలా వ్యాధుల నివారణకు నియంత్రిత ఆహారపు అలవాట్లు అవసరమని సూచించారు. ‘నలుగురు సభ్యుల కుటుంబంలో నెలకు 600 గ్రాముల ఉప్పు, 2 లీటర్ల వంట నూనె, 3 కిలోల పంచదార వాడితే సరిపోతుంది. ఉప్పు, వంటనూనె, చక్కెర తగ్గిస్తే ఆరోగ్య సమస్యలు దరిచేరవు. రాష్ట్ర ప్రజలు ప్రతిరోజూ అరగంట వ్యాయామం చేయాలి’ అని సీఎం పిలుపునిచ్చారు.