News April 5, 2025
ఏలూరు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

*జిల్లా వ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.*శ్రీ రామ నవమికి 8టన్నుల బెల్లాన్ని వితరణ చేసిన దెందులూరు MLA.* చింతలపూడిలో దంచి కొట్టిన వర్షం..నేలకొరిగిన చెట్లు.*cm పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, మంత్రి.*2024, 25 రబీ పంట కాలానికి ధాన్యం సేకరణ ప్రారంభం.*ఆటో నగర్లో స్థలాలు ఇవ్వాలని మెకానిక్‌ల సమావేశం.
Similar News
News April 7, 2025
ఫార్మసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా షేక్ యూనస్

ఫార్మసి సంక్షేమ సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా షేక్ యూనస్‌ను నియమిస్తూ రాష్ట్ర ఫార్మసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సురేశ్ బాబు ఉత్తర్వులు అందజేశారు. ఫార్మసీ చట్టం ప్రకారం ప్రతి మందుల షాపులలో ఫార్మసిస్ట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. 1948 సెక్షన్ 19 ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకొకసారి ఎలక్షన్స్ జరిపించాలని తెలిపారు.
News April 7, 2025
RARE: గోల్డెన్ టైగర్‌ను చూశారా?

అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కులో అరుదైన గోల్డెన్ టైగర్ కనిపించింది. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ సుధీర్ శివరామ్ బంగారు వర్ణపు పులి ఫొటోలను తన కెమెరాలో బంధించారు. సూడోమెలనిజం అనే అరుదైన జన్యు మార్పు కారణంగా ఇవి బంగారు-నారింజ రంగులో ఉంటాయని పశుసంరక్షణ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటివి చాలా అరుదని, ఎక్కడో ఓ చోట మాత్రమే కనిపిస్తాయని తెలిపారు.
News April 7, 2025
ఇల్లందకుంట: పట్టు వస్త్రాలు సమర్పించిన బండి సంజయ్

ఇల్లందకుంటలోని సీతారామచంద్ర స్వామి పట్టాభిషేకం సందర్భంగా సోమవారం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.