News April 5, 2025
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 46వ అథారిటీ సమావేశం

ఎన్టీఆర్: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 46వ అథారిటీ సమావేశం శనివారం జరిగింది. ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి నారాయణ, CS కె. విజయానంద్, CRDA కమిషనర్ కె.కన్నబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాజధాని పనులలో పురోగతి, అమరావతి పునః నిర్మాణ పనులకు ప్రధాని మోదీ హాజరు కానున్నందున కార్యక్రమ సన్నాహకాల గురించి చంద్రబాబు ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
Similar News
News April 7, 2025
కుక్క కాటుకు బలైన బాలుడి కుటుంబానికి ఆర్థికసాయం

గుంటూరులోని స్వర్ణభారతినగర్‌లో కుక్కల దాడిలో చనిపోయిన 4ఏళ్ల ఐజాక్ విషాద ఘటనపై సోమవారం రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సీఎం చంద్రబాబు బాలుడి కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఘటనపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News April 7, 2025
రూ.4,00,000.. వారం రోజులే గడువు

TG: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటివరకు 9 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. వారం రోజుల్లో గడువు ముగియనుండగా మొత్తంగా 20 లక్షల అప్లికేషన్లు వస్తాయని అంచనా. మే 31లోగా అర్హులను స్క్రీనింగ్ చేసి కలెక్టర్ల ఆమోదానికి అధికారులు పంపనున్నారు. జూన్ 2న అర్హులకు రుణాలు మంజూరు చేయనున్నారు. లబ్ధిదారులకు గరిష్ఠంగా రూ.4 లక్షల సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
News April 7, 2025
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి తీవ్ర అన్యాయం: టీపీసీసీ చీఫ్

TG: మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ తీరు ఫెడరల్, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ ఆరోపించారు. డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కుటుంబ నియంత్రణ ఆదేశాలను ధిక్కరించిన రాష్ట్రాలకు డీలిమిటేషన్‌తో లబ్ధి చేకూరుతుందన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ కోదండరాంతో కలిసి నడుస్తామని స్పష్టం చేశారు.