News April 5, 2025
2034 తర్వాతే జమిలి ఎన్నికలు: నిర్మల

2029లోపే ‘జమిలి’ని అమలు చేస్తారనే వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. 2034 తర్వాతే ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రపతి ఆమోదం కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నామన్నారు. ‘2024 LS ఎన్నికలకు ₹లక్ష కోట్లు ఖర్చయ్యింది. పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి ఎలక్షన్స్ నిర్వహిస్తే GDP 1.5% వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవస్థకు ₹4.50L Crను జోడించవచ్చు’ అని చెప్పారు.
Similar News
News December 29, 2025
వైకుంఠ ద్వార దర్శనం.. గదుల కేటాయింపు ప్రారంభం

AP: తిరుమల వైకుంఠ ద్వార దర్శన భక్తులకు గదుల కేటాయింపు ప్రారంభమైంది. ఎలక్ట్రానిక్ డిప్‌లో టోకెన్లు పొందిన వారికి సీఆర్వో విచారణ కేంద్రంలో గదులు కేటాయిస్తున్నారు. అటు ఇవాళ సర్వదర్శన టోకెన్లను టీటీడీ రద్దు చేసింది.
News December 29, 2025
వచ్చారు.. వెళ్లారు

TG: ఇటీవల ప్రెస్‌మీట్ తర్వాత KCR అసెంబ్లీ సెషన్‌లో పాల్గొంటారని జోరుగా చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత హోదాలో ఇవాళ సభకు హాజరైన ఆయన కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఉన్నారు. జాతీయ గీతాలాపన తర్వాత సభను వీడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీసిన ఆయన JAN 2, 3న నదీ జలాలపై జరిగే చర్చలో పాల్గొంటారని గులాబీ కార్యకర్తలు అంటున్నారు.
News December 29, 2025
ఆ ఎమ్మెల్యేలకు డోర్స్ క్లోజ్: కేటీఆర్

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాకుండా తమ పార్టీ తలుపులు మూసుకున్నాయని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తామని చిట్ చాట్‌లో తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తాము ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేని గతి పట్టిందని దుయ్యబట్టారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తగిలిందని, ఆ భయంతోనే మున్సిపల్ ఎన్నికలు పెట్టట్లేదని ఎద్దేవా చేశారు.


