News April 5, 2025
VKB: జిల్లాలో నేటి..TOP NEWS!!

✔ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ✔Weather Alert: పెరగనున్న ఎండలు ✔IPL బెట్టింగ్.. జోలికి వెళ్ళకండి:ఎస్సైలు ✔VKB: పద్మనాభ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం ✔జిల్లా సహకార శాఖ అధికారిగా నాగార్జున ✔‘కేంద్ర పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం’:BJP ✔VKB:19 ప్రభుత్వ పాఠశాలల్లో AI తరగతులు ✔జిల్లాలో తగ్గిపోతున్న మామిడి పంట ✔పలుచోట్ల సన్న బియ్యం పంపిణీ
Similar News
News April 7, 2025
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. 2,226 పాయింట్ల నష్టంతో sensex 73,137 పాయింట్ల వద్ద, 742 పాయింట్ల నష్టంతో nifty 22,161 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. ఇవాళ ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ.16 లక్షల కోట్లు నష్టపోయారు. ట్రెంట్, టాటా స్టీల్, JSW స్టీల్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎయిర్‌టెల్, AXIS, HDFC, ICICI, ITC షేర్లు భారీగా నష్టపోయాయి.
News April 7, 2025
కర్నూలును మెడికల్ హబ్‌గా మారుస్తాం: కర్నూలు ఎంపీ

కర్నూలును మెడికల్ హబ్‌గా మారుస్తామని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. సోమవారం నగరంలో నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ప్రతి ఒకరూ తమ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అనేక పథకాలను తీసుకొచ్చిందని, వాటిని అందరూ ఉపయోగించుకోవాలన్నారు.
News April 7, 2025
హైదరాబాద్‌లో మొదలైన వర్షం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మాదాపూర్, జూబ్లీహిల్స్, లక్డీకాపూల్, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి. మరికాసేపట్లో MBNR, మేడ్చల్, NGKL, RR, సిద్దిపేట, ములుగు, VKB జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, భద్రాద్రి, MHBD జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, గంటకు 41-61కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మీ ప్రాంతంలో వర్షం పడుతోందా?