News April 6, 2025

HYDలో రేపు మొత్తం వైన్స్ బంద్..!

image

శ్రీరామనవమిని పురస్కరించుకుని HYD నగరంలోని ట్రై కమిషనరేట్లు HYD, సైబరాబాద్, రాచకొండ పరిధిలో రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్స్ బంద్ ఉంటాయని అధికారులు తెలిపారు. రాచకొండ పోలీసులు నిన్ననే చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా HYD, సైబరాబాద్ పోలీసులు సైతం వెల్లడించారు. కల్లు దుకాణాలు, రెస్టారెంట్ల అనుబంధ బార్లు, మిలిటరీ క్యాంటీన్లు, స్టార్ హోటల్లు, రిజిస్టర్ క్లబ్లలోనూ బంద్ ఉంటాయన్నారు

Similar News

News July 6, 2025

JNTU: ఈ ఏడాది నుంచి 164 క్రెడిట్స్ అమలు

image

2025-26 విద్యా సంవత్సరానికి గాను జేఎన్టీయూ అధికారులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రతి సంవత్సరం 160 క్రెడిట్స్ వస్తేనే పట్టా ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని 164 క్రెడిట్స్‌కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వాటిలో 4 మినహాయించి 160 క్రెడిట్స్ వస్తేనే డిగ్రీ అందజేయనున్నారు. ఏదైనా కారణాలతో బీటెక్‌ను వదిలేస్తే కోర్సు పూర్తి చేసేందుకు 8 ఏళ్ల వరకు మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.

News July 6, 2025

గజ్వేల్: వృద్ధురాలిని చంపిన వ్యక్తి అరెస్టు

image

వృద్ధురాలిని హత్య చేసి బంగారు, వెండి వస్తువులను దొంగలించిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు గజ్వేల్ ఏసీపీ నర్సింలు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కోమటిపల్లికి చెందిన కిచ్చిగారి శివశంకర్(36)‌ను వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ వెల్లడించారు. గత నెల 26న ధర్మారెడ్డిపల్లికి చెందిన నల్ల సత్తెమ్మను కొడవలితో నరికి చంపి మెడలోని బంగారు చైన్, చెవి కమ్ములను అపహరించుకుపోయినట్లు ఏసీపీ వివరించారు.

News July 6, 2025

గూగూడులో శ్రీకుళ్లాయిస్వామికి 28 కేజీల వెండి గొడుగు

image

నార్పల మండలంలోని గూగూడులో వెలిసిన శ్రీకుళ్లాయిస్వామికి 28 కేజీలు వెండి గొడుగు దేవస్థానం అధికారులు చేయించారు. ఈ సందర్భంగా వెండి గొడుగును దేవస్థానం అగ్నిగుండం చుట్టూ ఊరేగించారు. వెండి గొడుగులు తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆసక్తి కనబరిచారు. దేవస్థానానికి ప్రతి ఏటా పెద్ద ఎత్తున వెండిని భక్తులు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.