News April 6, 2025
PBKS VS RR.. గెలుపెవరిదంటే?

PBKSతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 206 రన్స్ టార్గెట్‌తో బరిలో దిగిన పంజాబ్ 155/9 స్కోరుకే పరిమితమైంది. నెహాల్ వధేరా(62), మ్యాక్స్‌వెల్(30) మినహా జట్టులో అందరూ విఫలమయ్యారు. RR బౌలర్లలో ఆర్చర్ 3, సందీప్ శర్మ, తీక్షణ చెరో 2 వికెట్లు, కుమార్ కార్తికేయ, హసరంగ చెరో వికెట్ తీశారు. ఈ సీజన్లో PBKSకు ఇదే తొలి ఓటమి.
Similar News
News April 13, 2025
మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు.. అందరికీ థాంక్స్: పవన్ కళ్యాణ్

తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, కోలుకుంటున్నాడని Dy.CM పవన్ ప్రకటించారు. సింగపూర్‌లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన తన కొడుకు కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ Xలో ధన్యవాదాలు తెలిపారు. ఈ కష్టసమయంలో అండగా నిలిచిన జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు, శ్రేయోభిలాషులు, సినీ, రాజకీయ ప్రముఖులకు కృతజ్ఞతలు చెప్పారు. కాగా కొడుకుతో కలసి పవన్ నిన్న ఇండియాకు తిరిగొచ్చారు.
News April 13, 2025
మయన్మార్‌లో మరోసారి భూకంపం

వరుస భూకంపాలతో మయన్మార్ వణికిపోతోంది. ఇవాళ ఉదయం దేశంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.5గా నమోదైంది. కాగా ఇటీవల సంభవించిన భారీ భూకంపంతో మయన్మార్ అతలాకుతలం అయింది. 3వేల మందికి పైగా మరణించారు. శిథిలాల తొలగింపు ఇంకా కొనసాగుతోంది. రూ.వేల కోట్ల ఆస్తులు ధ్వంసం అయ్యాయి. ఆ తర్వాత కూడా తరచూ భూకంపాలు వస్తుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
News April 13, 2025
తెలంగాణలో రెండ్రోజులు వర్షాలు

TG: ఉపరితల ద్రోణి ప్రభావంతో 2 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల ఓ మోస్తరు వానలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. మంచిర్యాల, జయశంకర్ భూపాల్ పల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.