News April 6, 2025
రష్యా పేరెత్తడానికే US భయపడుతోంది: జెలెన్‌స్కీ

రష్యా తాజాగా చేసిన దాడుల్లో ఎనిమిది మంది పిల్లలు సహా 14 మంది మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. ఈ విషయాన్ని US ఎంబసీకి తెలియజేస్తే బలహీనమైన ప్రతిస్పందన వచ్చిందన్నారు. ‘అగ్రరాజ్యమైనప్పటికీ ఆశ్చర్యకరంగా వీక్ రియాక్షన్ వచ్చింది. వాళ్లు రష్యన్ పేరు చెప్పడానికీ భయపడుతున్నారు’ అని ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యాక ఉక్రెయిన్‌కు సాయం నిలిచిపోయిన విషయం తెలిసిందే.
Similar News
News April 8, 2025
జైపూర్ బాంబు పేలుళ్ల నిందితులకు కోర్టు శిక్ష

జైపూర్ (రాజస్థాన్) బాంబు పేలుళ్ల నిందితులకు అక్కడి ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ ఘటనలో నిందితులైన షహబాజ్ హుస్సేన్, సర్వర్ అజ్మీ, మహ్మద్ సైఫ్, సైఫుర్ రెహ్మాన్‌లకు జీవిత ఖైదు విధిస్తూ స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించింది. 2008 మే13న జైపూర్‌లో 15నిమిషాల వ్యవధిలో 8 బాంబులు పేలాయి. ఈ ఘటనలో 71 మంది మృతి చెందగా, 180 మందికి పైగా గాయపడ్డారు.
News April 8, 2025
పవన్ తనయుడి ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. పవన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సింగపూర్‌లోని స్కూలులో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ తనయుడికి గాయాలైన సంగతి తెలిసిందే. కాసేపటి క్రితం ఆయన తన కుమారుడి వద్దకు బయల్దేరారు.
News April 8, 2025
ఈనెల 15 నుంచి ఇంటింటికీ ‘మన మిత్ర’

AP: వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 15 నుంచి ఇంటింటికీ ‘మన మిత్ర’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం వాట్సాప్ ద్వారా అందిస్తున్న 250కు పైగా సేవలపై అవగాహన కల్పించనున్నారు. వారి ఫోన్లలో మన మిత్ర నంబర్(9552300009)ను సేవ్ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది.