News March 26, 2024
FACTCHECK: ఈ మెయిల్స్ ఫేక్

ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరోకు సంబంధించిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ రీసెర్చ్ ఆనాలిసిస్ వింగ్ నోటీసులు పంపినట్లు వస్తోన్న మెయిల్స్‌పై PIB FACTCHECK స్పందించింది. ఈ మెయిల్‌ను IB పంపలేదని, వీటిని నమ్మొద్దని ఫ్యాక్ట్‌చెక్ వెల్లడించింది. ‘మీరు ఐపీ అడ్రెస్ నిబంధనలు అతిక్రమించింది. వారం రోజుల్లో ఆఫీస్‌కు వచ్చి హాజరుకావాలి’ అని ఆ మెయిల్‌లో ఉంది. ఆఫీస్‌కు రాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Similar News
News March 25, 2026
శ్రీకాకుళం: డయేరియా ఘటనలో సస్పెండ్.. మళ్లీ ఆయనే కమిషనర్

నగరపాలక సంస్థ కమిషనర్ హనుమంతు కూర్మారావును ప్రభుత్వం మళ్లీ నియమించింది. విధుల్లో చేరిన కొద్ది రోజుల్లోనే తాగునీటి కలుషితం జరిగి డయేరియా ప్రబలిన నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే త్రిసభ్య కమిటీ నివేదికలో ఆయన వైఫల్యం లేదని తేలింది. దీంతో ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేసి పునర్నియామక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
News March 25, 2026
మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్

AP: సొంత ఊరికి దూరంగా ఉంటూ నగరాలు, పట్టణాల్లో ఉద్యోగం చేసే మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి వసతి, భద్రత కోసం రాష్ట్రవ్యాప్తంగా ‘సఖి నివాస్’ పేరిట కొత్తగా 30 వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో హాస్టల్‌లో 30 మందికి వసతి కల్పించనుంది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగినులతో పాటు చదువుకునే యువతులకు తక్కువ ధరకే వసతి, భోజన సదుపాయం కల్పించనున్నారు.
News March 25, 2026
షేన్ వార్న్ దూరదృష్టి.. RR డీల్‌తో పిల్లలకు భారీ ఆస్తి!

RR మాజీ కెప్టెన్, దివంగత షేన్ వార్న్ ముందుచూపు ఎలాంటిదో ఇప్పుడు రుజువైంది. IPL ప్రారంభంలో 4 సీజన్లకు కలిపి కేవలం ₹9.35 కోట్ల శాలరీ మాత్రమే తీసుకున్న ఆయన రిటైర్మెంట్ డీల్‌లో ఆడిన ప్రతి సీజన్‌లో 0.75% వాటా కావాలని కండిషన్ పెట్టారు. అలా 4 ఏళ్లలో 3% వాటా దక్కించుకున్నారు. తాజాగా RR ₹15,301 కోట్లకు అమ్ముడవడంతో ఆ 3% విలువ ఏకంగా ₹460 కోట్లకు చేరింది. ఇప్పుడు వార్న్ పిల్లలు కోటీశ్వరులయ్యారు.


