News April 6, 2025
నిందితులకు శిక్ష పడేలా చూడాలి: GNT ఎస్పీ

న్యాయస్థానాల్లో రౌడీ షీటర్లు, NDPS కేసుల్లో ముద్దాయిలకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో కోర్టు కానిస్టేబుల్‌లతో శనివారం ఎస్పీ సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌లకు సంబంధించి వివిధ న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న కేసుల విచారణను వేగవంతం చేసే విధంగా తగిన ప్రణాళికలు రూపొందించాలన్నారు.
Similar News
News April 8, 2025
GNT: మందుబాబులపై లోకేశ్ సెటైరికల్ పోస్ట్

గుడివాడలో ఇంజినీరింగ్ కాలేజీ వెనుక బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న యువకులను డ్రోన్ కెమెరాలతో పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. `పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్న వారిని చూస్తే జాలేస్తోంది. సారీ గాయ్స్.. నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నా.. ఎందుకంటే ఏపీ పోలీసులు వారి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు’ అని X లో పోస్ట్ చేశారు.
News April 8, 2025
బీటెక్ విద్యార్థి అరెస్ట్: సింగరాయకొండ సీఐ

గుంటూరుకు చెందిన విద్యార్థి రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు.. గుంటూరుకు చెందిన రాజు టంగుటూరులోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. హాస్టల్లో ఉండే అతను వేరే చోటు నుంచి గంజాయి తీసుకు వచ్చి యువకులకు విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారంతో సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, ఎస్ఐ నాగమల్లేశ్వరావు టంగుటూరు టోల్ ప్లాజా దగ్గర అదుపులోకి తీసుకున్నారు. సుమారు 4.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
News April 8, 2025
ఓటీటీలకు సెన్సార్ అవసరం: దిలీప్ రాజా

తెనాలిలోని మా ఏపీ కార్యాలయంలో సోమవారం కేంద్ర సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు దిలీప్ రాజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటీటీల్లో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్, సినిమాల్లో శృంగార దృశ్యాలు యువతపై మానసిక ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి సెన్సార్ విధించడం ద్వారా నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. కేంద్ర సమాచారశాఖకు పలు విజ్ఞప్తులు పంపినట్టు చెప్పారు. పోర్న్ సైట్లపై కూడా నిషేధం అవసరమని అన్నారు.