News April 6, 2025

లక్ష్యంతో ఉన్నత ఉద్యోగం సాధించాలి: ఖమ్మం కలెక్టర్

image

పోటీ పరీక్షలలో అభ్యర్థులు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, వాటి సాధన దిశగా పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్, ఖమ్మం బైసాస్ రోడ్డులోని జలగం వెంగళరావు తెలంగాణ బిసీ స్టడీ సర్కిల్‌ను సందర్శించి, వివిధ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులతో ముచ్చటించారు. అభ్యర్థులకు కలెక్టర్ పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.

Similar News

News April 9, 2025

యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

image

రాజీవ్ యువ వికాసం పథకం కింద వచ్చే దరఖాస్తుల స్వీకరణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అప్లికేషన్లు సమర్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లను పరిశీలించారు. కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ కోసం 5 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.

News April 9, 2025

గురుకుల కళాశాలలో ప్రవేశాలకు మే 10న ఎంట్రన్స్ పరీక్ష

image

ఖమ్మం: గురుకుల (రెసిడెన్షియల్) జూనియర్ కళాశాలల్లో 2025-26 విద్యా సం.కి ఇంటర్మీడియట్ మొదటి సం. ప్రవేశాలకు మే 10న ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు గురుకుల జిల్లా సమన్వయ అధికారిణి రమ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూప్‌లలో చేరుటకు మే 10న ఉ.10 నుండి మ.12-30 వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. www.tgrjdc.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

News April 8, 2025

క్షయ వ్యాధి నివారణపై అవగాహన కల్పించాలి: DMHO

image

రఘునాథపాలెం: క్షయ వ్యాధి నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని డిఎంహెచ్వో డా. కళావతి బాయ్ అన్నారు. జిల్లాలో పని చేస్తున్న మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లకు విధి నిర్వహణ పై జిల్లా కలెక్టరేట్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలలో అవగాహన పెంచాలన్నారు. 

error: Content is protected !!