News April 6, 2025
వినుకొండ: కళాకారుల సమస్యలు పరిష్కరించండి

వినుకొండలోని గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో 5 మండలాల కళాకారులతో శనివారం ఛలో కలెక్టరేట్ కార్యక్రమానికి ర్యాలీగా నరసరావుపేటకి బయలుదేరి వెళ్లారు. కళాకారులు పడుతున్న ఇబ్బందులు, కళాధరణ లేక ఉండటానికి ఇల్లు లేక అనేక రకాల సమస్యలతో ఉన్న కళాకారులకి ప్రభుత్వం ద్వారా, అధికారుల ద్వారా న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి కళాకారులు పాల్గొన్నారు.
Similar News
News September 16, 2025
బతుకమ్మ పండుగకు పకడ్బందీ ఏర్పాట్లు: కమిషనర్

బతుకమ్మ పండుగ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో ఇంజినీరింగ్, శానిటేషన్ అధికారులతో బతుకమ్మ ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్లపై ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించుటకు సూచనలు చేశారు.
News September 16, 2025
పోషణ మాసోత్సవాలకు ఎమ్మెల్యే కవ్వంపల్లికి రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు జరిగే పోషణ మాసోత్సవాల కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనాయణకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఈ మేరకు, కరీంనగర్ జిల్లా మహిళా సంక్షేమ అధికారి ఎం. సరస్వతి, మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఆహ్వాన పత్రాన్ని మంగళవారం ఎల్‌ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో ఎమ్మెల్యేకు అందజేశారు.
News September 16, 2025
ప్రజా పాలన దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

జిల్లా కేంద్రంలోని ఐడిఓసీ కార్యాలయంలో బుధవారం జరిగే ప్రజాపాలన దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఉదయం 10 గంటలకు ముఖ్య అతిథి జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి అధికారులు, సిబ్బంది సమయానికి హాజరు కావాలని ఆదేశించారు.