News April 6, 2025
బాపట్ల: పోలీస్ శాఖకు ఎమ్మెల్యే ప్రశంసలు

బాపట్ల జిల్లా పోలీస్ శాఖకు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అభినందనలు తెలిపారు. ఇంకొల్లు పట్టణానికి చెందిన జాగర్లమూడి శివ ప్రసాద్ తండ్రి హరిబాబు, ఇంట్లో జరిగిన చోరీ కేసును 24 గంటల్లోనే పరిష్కరించి అద్భుత పని తీరు కనబరిచారన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 3న అర్ధరాత్రి సమయంలో రూ.75 లక్షల చోరీ జరిగిందన్నారు. ఈ మేరకు జిల్లా పోలీసులు చేస్తున్న కృషిని ఎమ్మెల్యే కొనియాడారు.
Similar News
News July 9, 2025
పెద్దపల్లి: గానుగ వృత్తి పరిరక్షణకు ప్రభుత్వం కృషి: మంత్రి

తెలంగాణ కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గడ్డం వివేక్‌ను గానుగ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డా.లెక్కల నాగేశ్ ఈరోజు పెద్దపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. గానుగ వృత్తి పరిరక్షణ, గాండ్ల యువతకు నైపుణ్య శిక్షణ, సబ్సిడీతో గానుగలు, గాండ్ల కార్పొరేషన్ ఏర్పాటుపై వినతిపత్రం అందించారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ కుల వృత్తుల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
News July 9, 2025
గిరి ప్రదక్షిణలో మాధవ స్వామి ఆలయానికి వెళ్తున్నారా..!

సింహాచలం గిరి ప్రదక్షిణ బుధవారం ఉదయం నుంచి ప్రారంభం అయ్యింది. భక్తులు ఇప్పటికే నడక ప్రారంభించారు. అయితే మాధవధారలో సింహాచలం కొండను అనుకోని ఉన్న మాధవస్వామి ఆలయాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకొని గిరి యాత్ర కొనసాగించాలి. అప్పుడు మాత్రమే గిరి ప్రదక్షిణ సంపూర్ణం అవుతుందని పెద్దలు చెబుతున్నారు. అయితే మాధవస్వామి ఆలయం నుంచి మెట్ల మార్గాన సింహాచలానికి దారి కూడా ఉంది.
News July 9, 2025
సీఎం బందోబస్తుకు వచ్చిన పోలీసులకు ఎస్పీ దిశానిర్దేశం

సీఎం పర్యటనకు బందోబస్తుగా వచ్చిన పోలీసులకు ఎస్పీ వి.రత్న దిశానిర్దేశం చేశారు. పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కొత్తచెరువులో గురువారం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గట్టి బందోబస్తు నిర్వహించాలని పోలీసులు సూచించారు.