News April 6, 2025
కనిగిరి: కారుణ్య ఉద్యోగ నియామక పత్రం అందజేసిన ఎమ్మెల్యే ఉగ్ర

మిట్టపాలెం శ్రీ నారాయణ స్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకుడు సత్యనారాయణ శర్మ ఇటీవల మృతి చెందారు. ఆయన కుమారుడు నారాయణ స్వామికి దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్‌గా కారుణ్య నియామకం కింద ఉద్యోగం లభించింది. శనివారం నియామక ఉత్తర్వులు కనిగిరిలో MLA ఉగ్ర నరసింహ రెడ్డి నారాయణస్వామికి అందజేశారు. కార్యక్రమంలో నారాయణస్వామి ఆలయ ఈవో నరసింహ బాబు పాల్గొన్నారు.
Similar News
News April 8, 2025
రూ.143 కోట్లతో మరమ్మతులు: మంత్రి స్వామి

మంత్రి స్వామి డెహ్రాడూన్‌లో జరుగుతున్న చింతన్ శివిర్ రెండవ రోజు సమావేశంలో మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో అమలు చేయనున్న పీ-4పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. రూ.143 కోట్లతో సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతులు చేస్తున్నామన్నారు. దళితుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు.
News April 8, 2025
పేదల గృహాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

ప్రకాశం జిల్లాలో పేదల గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సోమవారం ఆమె మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మే 31వ తేదీ నాటికి జిల్లా వ్యాప్తంగా 8,839 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు.
News April 8, 2025
కందుకూరులో కనిగిరి యువకుడి ఆత్మహత్య

కందుకూరు పట్టణంలో కనిగిరి యువకుడు ఉరేసుకున్నాడు. కల్లూరి శివ నాగరాజు(26) కందుకూరు పోస్టాఫీస్ సెంటర్‌కు సమీపంలోని వెంకటరమణ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కనిగిరిలో క్రికెట్ బెట్టింగ్ వేసి అప్పులపాలై కందుకూరులో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.