News April 6, 2025
MNCL: ఈ నెల 7 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం

మంచిర్యాలలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్‌లో ఈ నెల 7 నుంచి 15 వరకు పదో తరగతి పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతుందని డీఈఓ యాదయ్య తెలిపారు. మూల్యాంకనం కోసం మొత్తం 770 మందిని నియమించామని, వారంతా ఈ నెల 7న రిపోర్టు చేయాలని సూచించారు. కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు అనుమతించబడవని వెల్లడించారు.
Similar News
News January 15, 2026
మృణాల్, ధనుశ్ పెళ్లంటూ ప్రచారం!

తమిళ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోనున్నట్లు మరోసారి ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 14(ప్రేమికుల రోజు)న వీరిద్దరూ వివాహ జీవితంలోకి అడుగుపెడతారని దాని సారాంశం. అతికొద్ది మంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వీరు ఒక్కటి కానున్నారని తెలుస్తోంది. గతంలోనూ వీరు ప్రేమలో ఉన్నారని ప్రచారం జరగ్గా మృణాల్ ఖండించారు. అయితే తాజా ప్రచారంపై ధనుశ్, మృణాల్ ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
News January 15, 2026
తిరుమలలో వరుస సెలవులతో భక్తజనసంద్రం

వరుస సెలవుల కారణంగా తిరుమలకు భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. సర్వదర్శనం క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు చేరగా, దర్శనానికి 15 గంటలకుపైగా సమయం పడుతోంది. రూములు దొరక్క కొందరు భక్తులు లాకర్లు, ఆరుబయటే విశ్రాంతి తీసుకుంటున్నారు. కాలినడక మార్గాల్లోనూ భారీ రద్దీ కొనసాగుతోంది. టైమ్ స్లాట్ దర్శనానికి సుమారు 6 గంటలు పడుతుండగా, భక్తులకు ఇబ్బందులు లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.
News January 15, 2026
కోకాకోలా $1B ఐపీఓ? క్లారిటీ ఇచ్చిన కంపెనీ

హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ (HCCB) IPOపై వస్తున్న వార్తలను ఆ కంపెనీ తోసిపుచ్చింది. ఈ వేసవిలో లేదా సమీప భవిష్యత్తులో అలాంటి ప్లాన్స్ ఏమీ లేవని సంస్థ ప్రతినిధి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాము కేవలం మార్కెట్‌లో పట్టు సాధించడం, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంపైనే ఫోకస్ పెట్టామన్నారు. GST వల్ల లభించిన ధరల ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేస్తున్నామని తెలిపారు. IPO వార్తలన్నీ ఊహాగానాలేనన్నారు.


