News April 6, 2025
శుభ ముహూర్తం (06-04-2025)(ఆదివారం)

తిథి: శుక్ల నవమి రా.11.38 వరకు
నక్షత్రం: పునర్వసు ఉ.9.58 వరకు
రాహుకాలం: సా.4.30-సా.6.00 వరకు
యమగండం: మ.12.00-మ.1.30 వరకు
దుర్ముహూర్తం: సా.4.25-సా.5.13 వరకు
వర్జ్యం: సా.6.03-సా.7.39 గంటల వరకు
అమృత ఘడియలు: ఉ.7.37-ఉ.9.09 వరకు
Similar News
News April 8, 2025
పూరన్ దెబ్బకు సెహ్వాగ్ రికార్డు బద్దలు

KKRతో మ్యాచులో LSG విధ్వంసకర ప్లేయర్ నికోలస్ పూరన్ (36 బంతుల్లోనే 87 ) ఊచకోత కోశారు. ఈ క్రమంలో పూరన్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2,000 పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. 1,198 బంతుల్లోనే ఆయన 2 వేల పరుగులు మార్కును అందుకున్నారు. ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ (1,211 బంతుల్లో) రికార్డును చెరిపేశారు. అగ్ర స్థానంలో రస్సెల్ (1,120 బంతుల్లో) ఉన్నారు.
News April 8, 2025
మంచు విష్ణుపై మనోజ్ ఫిర్యాదు

మంచు కుటుంబంలో మరోసారి వివాదం జరిగినట్లు తెలుస్తోంది. తన ఇల్లు ధ్వంసం చేశారని మంచు విష్ణుపై నార్సింగి పీఎస్‌లో మనోజ్ ఫిర్యాదు చేశారు. తన కూతురు పుట్టినరోజు సందర్భంగా రాజస్థాన్‌కు వెళ్లిన సమయంలో ఇంటిని ధ్వంసం చేశారని, కారుతో పాటు విలువైన వస్తువులను దొంగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తండ్రి మోహన్ బాబుతో మాట్లాడే ప్రయత్నం చేశానని, కానీ ఆయన అందుబాటులోకి రాలేదని చెప్పారు.
News April 8, 2025
రాష్ట్రంలో బార్స్, వైన్స్ మధ్య రగడ

TG: రాష్ట్రంలో మద్యం దుకాణాల మధ్య వివాదం చెలరేగింది. వైన్ షాపులు రాత్రి 11 గంటలకు తెరిచి ఉండటం వల్ల తాము నష్టపోతున్నామని, 10 గంటలకే మూసేలా చర్యలు తీసుకోవాలని బార్ల అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పర్మిట్ రూములనూ మూసేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు తమ వల్లే ప్రభుత్వానికి 85% ఆదాయం వస్తోందని, బార్ల వల్ల 15% మాత్రమే ఆదాయం వస్తోందని వైన్స్ అసోసియేషన్ నాయకులు వాదిస్తున్నారు.