News April 6, 2025
వైఎస్ జగన్ రాప్తాడు పర్యటన ఖరారు

మాజీ సీఎం వైఎస్ జగన్ రాప్తాడు పర్యటన ఖరారైంది. ఈ నెల 8న పాపిరెడ్డిపల్లి గ్రామంలో ఆయన పర్యటించనున్నారు. ఇటీవల ప్రత్యర్థుల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ పర్యటన వేళ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వైసీపీ కీలక నేతలు శనివారం సమావేశం నిర్వహించి చర్చించారు.
Similar News
News April 8, 2025
SKLM: మే 10న జాతీయ లోక్ అదాలత్

ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాబోయే మే 10న జిల్లా స్థాయిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనునట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జూనైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 8, 2025
ఇచ్ఛాపురం: రైలు ప్రమాదంలో గుర్తుతెలియని యువకుడి మృతి

ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ సమీపంలో సూది కొండ వద్ద గుర్తుతెలియని యువకుడు రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ హరినాథ్ మంగళవారం తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 20 నుంచి 25 ఉంటుందన్నారు. నీలం రంగు షర్ట్ ధరించి ఉన్నాడన్నారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తించినట్లయితే 89850 21143 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
News April 8, 2025
MHBD: వడగండ్ల వాన వల్ల పంట నష్టం ప్రాథమిక అంచనా వివరాలు

మహబూబాబాద్ జిల్లాలోని వివిధ మండలాల్లో సోమవారం రాత్రి ప్రకృతి వైపరీత్యాలు, ఈదురు గాలులు, వడగండ్ల వాన వల్ల సంభవించిన పంట నష్టాన్ని వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేసినట్లు జిల్లా వ్యవసాయధికారి విజయ నిర్మల తెలిపారు. జిల్లాలో రైతులు 1685కి గాను వరి పంట 2686 ఎకరాలు, 71 మంది రైతులకు గాను మొక్కజొన్న 130 ఎకరాలు, 140 మంది రైతులకు మామిడి 473 ఎకరాలు, బొప్పాయి 5, సపోట 4 ఎకరాల్లో నష్టం వాటిల్లింది.