News April 6, 2025
నారాయణపేట: ఆరుగురిపై కేసు నమోదు

నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల శివారులో కొంత మంది జూదం ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్, ఉట్కూరు పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.7,700 నగదు, 6 సెల్‌ఫోన్లు, 3 బైక్‌లు, పేకముక్కలు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించామని ఎస్ఐ కృష్ణంరాజు శనివారం తెలిపారు. గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Similar News
News April 8, 2025
ఈనెల 15 నుంచి ఇంటింటికీ ‘మన మిత్ర’

AP: వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 15 నుంచి ఇంటింటికీ ‘మన మిత్ర’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం వాట్సాప్ ద్వారా అందిస్తున్న 250కు పైగా సేవలపై అవగాహన కల్పించనున్నారు. వారి ఫోన్లలో మన మిత్ర నంబర్(9552300009)ను సేవ్ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది.
News April 8, 2025
MBNR: అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. రూరల్ ఎస్ఐ విజయ్ కుమార్ వివరాలు.. పురపాలక పరిధిలోని ఏనుగొండ సరస్వతి దేవి గుడి కమాన్ ప్రాంతంలో ఓ వ్యక్తి చనిపోయి ఉన్న విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఇతర వివరాలకు 8712659336 నంబర్‌పై సంప్రదించాలన్నారు.
News April 8, 2025
చరిత్ర సృష్టించిన రజత్ పాటీదార్

ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ సరికొత్త ఘనత సాధించారు. IPL సింగిల్ ఎడిషన్‌లో MIని వాంఖడే, KKRను ఈడెన్‌లో, CSKను చెపాక్‌లో ఓడించిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించారు. గతంలో పంజాబ్ ఈ ఫీట్ సాధించినా ఇద్దరు నాయకుల సారథ్యంలో నమోదైంది. ఆడమ్ గిల్‌క్రిస్ట్ (KKR), డేవిడ్ హస్సీ (CSK, MI) కలిసి ఈ రికార్డు నెలకొల్పారు. కోహ్లీకి కూడా సాధ్యం కాని రికార్డును పాటీదార్ సాధించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.