News April 6, 2025
వనపర్తిలో శవం కలకలం..!

డ్రైనేజ్ కాలువలో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. వనపర్తి 20వ వార్డుకు చెందిన కార్ డ్రైవర్ శ్రీను(46) శనివారం సాయంత్రం రామా టాకీస్ ఎదురుగా ఉన్న డ్రైనేజీ కాలువలో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 8, 2025
IPL: ఓడిపోయినా మనసులు గెలుచుకున్నాడు

లక్నోతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో కేకేఆర్ పోరాడి ఓడింది. 239 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆ జట్టు బ్యాటర్లు ఆఖరి వరకు పోరాటం చేశారు. చివరి ఓవర్లో 24 రన్స్ చేయాల్సి ఉండగా రింకూ సింగ్ 14 రన్స్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరి ఓవర్ మొదట్లోనే స్టైక్ వస్తే రింకూ కచ్చితంగా గెలిపించేవాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?
News April 8, 2025
ప్రియాంశ్ దూకుడు.. 19 బంతుల్లోనే ఫిఫ్టీ

IPL: చెన్నైతో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ యువ బ్యాటర్ ప్రియాంశ్ ఆర్య అదరగొడుతున్నారు. పవర్ ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయినా దూకుడుగా ఆడుతున్నారు. ఈ క్రమంలో 19 బంతుల్లో 4 సిక్సర్లు, 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం పంజాబ్ స్కోర్ 6 ఓవర్లలో 75/3గా ఉంది. ప్రభ్‌సిమ్రాన్ (0), శ్రేయస్ అయ్యర్ (9), స్టాయినిస్ (4) ఔటయ్యారు.
News April 8, 2025
మెప్మా ఉత్పత్తులకు గిన్నిస్ రికార్డు: ఎమ్మిగనూరు కమిషనర్

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలోని మహిళా స్వయం సహాయక బృందాల్లో, ఒక్క రోజులోనే లక్షకు పైగా మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను విక్రయించారు. దీంతో వారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కింది. ఈ విషయాన్ని ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన మిషన్ నుంచి ప్రశంసలు అందుకున్నట్లు వారు తెలిపారు.