News April 6, 2025
మహబూబ్‌నగర్‌లో నేడు చికెన్, మటన్ షాపులు బంద్

శ్రీరామ నవమిని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆదివారం చికెన్, మటన్, చేపలు తదితర మాంసం దుకాణాలు మూసివేయాలని కమిషనర్ మహేశ్వర్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా మున్సిపాలిటీ హెచ్చరికలను బేఖాతరు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలంతా ఈ విషయాన్ని గమనించి మున్సిపాలిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. SHARE IT
Similar News
News April 12, 2025
ఉమ్మడి జిల్లాలో రేపు మద్యం దుకాణాలు బంద్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని అన్ని మద్యం దుకాణాలు మూసివేయాలని జిల్లా కలెక్టర్‌లు అధికారులను ఆదేశించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూసి ఉంచాలని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులను పాటించని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News April 12, 2025
పొన్నకల్: వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సందర్శించి, వరి ధాన్యం సేకరణను పరిశీలించారు. వరి ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరగకుండా కొనుగోలు చేయాలని, కొనుగోలులో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పర్యటనలో సింగిల్ విండో డైరెక్టర్ లు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
News April 11, 2025
MBNR: పరిశ్రమల స్థాపనకు తక్షణమే అనుమతులు: కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల పరిశ్రమలకు వెంటనే ఆయా శాఖల అధికారులు అనుమతుల్ని మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్లో పరిశ్రమల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు అనుమతుల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయో వాటిని ఈ నెలాఖరులో మంజూరు చేయాలన్నారు. పరిశ్రమల స్థాపన పట్ల నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే మంజూరు చేయలన్నారు.