News April 6, 2025

నాగర్‌కర్నూల్ జిల్లాలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని సింగోటం క్రాస్ రోడ్డు వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పెంట్లవెల్లి వాసి గార్డుల లేవన్న(45) పనిమీద పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్‌కి వెళ్లాడు. తిరిగొస్తుండగా శనివారం రాత్రి కొల్లాపూర్‌లోని సింగోటం క్రాస్ రోడ్డు ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని రాంగ్ రూట్లో వెళ్లి బైక్‌తో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

Similar News

News November 13, 2025

ఏలూరు జిల్లా వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు

image

ఏలూరు జిల్లా అంతటా పోలీసు బృందాలు బుధవారం రాత్రి వేళల్లో వాహనాలను తనిఖీ చేశాయి. గంజాయి, అక్రమ మద్యం, డ్రగ్స్ వంటి నిషేధిత వస్తువులు” రవాణా కాకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటూ జిల్లా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజల భద్రత కోసం ఈ తనిఖీలు కొనసాగనున్నాయని పోలీసులు తెలిపారు.

News November 13, 2025

గుడివాడకు జనవరి 12వ తేదీ నుంచి వందే భారత్ రైలు

image

చెన్నై-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవను గుడివాడ జంక్షన్, భీమవరం టౌన్ మీదుగా నరసాపురం వరకు జనవరి 12వ తేదీ నుంచి పొడిగిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విస్తరణతో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు ఇది ఎంతో ప్రయోజనకరం కానుంది.

News November 13, 2025

సిద్దిపేట: ఏడాది‌లో 777 మైనర్ డ్రైవింగ్ కేసులు

image

సిద్దిపేట జిల్లాలో ఈ ఏడాది కాలంలో మొత్తం 777 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. విద్యార్థులు అధికంగా ఉండే స్కూళ్లు, కాలేజీల వద్ద ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మైనర్లు వాహనాలు నడుపుతున్నట్లు కనిపిస్తే వెంటనే అదుపులోకి తీసుకొని వాహనాన్ని సీజ్ చేస్తున్నారు. పట్టుబడితే మరుసటి రోజు తల్లిదండ్రులను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.