News April 6, 2025
సుంకాలు తగ్గించేందుకు చైనాకు ట్రంప్ ఆఫర్

సుంకాల విషయంలో US అధ్యక్షుడు ట్రంప్ చైనాకు ఓ ఆఫరిచ్చారు. బీజింగ్‌పై విధించిన సుంకాల్ని తగ్గించాలంటే చైనా అధీనంలోని టిక్‌టాక్‌ను అమెరికా సంస్థకు అమ్మేయాలని డిమాండ్ చేశారు. బైడెన్ సర్కారు ఆ సంస్థపై విధించిన నిషేధాన్ని ట్రంప్ ఎత్తేసి, బ్యాన్‌ను 75 రోజులపాటు వాయిదా వేయడం గమనార్హం. టిక్‌టాక్ అమెరికన్ల సమాచారాన్ని దొంగిలించి చైనాకు ఇస్తోందని ట్రంప్ చాలాకాలంగా ఆరోపిస్తున్నారు.
Similar News
News April 9, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News April 9, 2025
TODAY HEADLINES

* పేద బిడ్డల విద్యపై నిర్లక్ష్యం క్షమించరానిది: సీఎం రేవంత్
* పోలీసుల బట్టలు ఊడదీస్తాం: YS జగన్
* అల్ప పీడనం.. రేపు, ఎల్లుండి పిడుగులతో కూడిన వర్షాలు
* అగ్నిప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాలు
* జూన్ నాటికి మెగా డీఎస్సీ: నారా లోకేశ్
* త్వరలో భారీ భూకుంభకోణం బయటపెడతాం: కేటీఆర్
* పదేళ్లలో ఎన్నో కలలను నిజం చేశాం: మోదీ
* ఐపీఎల్‌లో కోల్‌కతాపై లక్నో, చెన్నైపై పంజాబ్ విజయం
News April 9, 2025
IPL: స్టేడియంలో చాహల్ గర్ల్ ఫ్రెండ్ సందడి

సీఎస్కే-పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్ రూమర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్జే మహ్వాష్ సందడి చేశారు. పంజాబ్ వికెట్లు తీసినప్పుడు ఆమె స్టాండ్స్‌లో ఎగిరి గంతులేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ధనశ్రీ వర్మతో విడాకుల అనంతరం చాహల్ ఆమెతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల చాహల్‌తో కలిసి మహ్వాష్ ఓ మ్యాచ్ కూడా తిలకించారు.