News April 6, 2025

మెదక్: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన కొల్చారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని వరిగుంతం గ్రామానికి చెందిన పోచయ్య (39) తాను నూతనంగా నిర్మిస్తున్న ఇంటి గోడపై నీరు పడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి గాయాలపాలయ్యాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు తెలిపారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 9, 2025

మెదక్: జీవో సవరణ కోసం వీఆర్వోల వినతి

image

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు పూర్వ వీఆర్వోలు వినతి పత్రం సమర్పించారు. వీఆర్వోలు, వీఆర్ఏలను జిపిఓలుగా తీసుకోవడానికి జారీచేసిన జీవో 129ను సవరణ చేసి పాత వీఆర్వోలను యధావిధిగా కామన్ సర్వీస్ ఇస్తూ నియామకం చేయాలని కోరారు. మెదక్‌లో సమావేశం నిర్వహించి 16లోగా గూగుల్ ఫారం నింపాలని జారీ చేసిన ఆదేశాలపై చర్చించారు. జీవో లోపాలను సవరిస్తూ పాత సర్వీస్‌ కౌంట్ చేస్తూ, యధావిధిగా తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు

News April 8, 2025

మెదక్: దేవాలయంలో పడగ విప్పిన నాగుపాము

image

మెదక్ జిల్లా శివంపేట మండలం బిజిలి పూర్‌లోని హనుమాన్ దేవాలయంలో నాగుపాము దర్శనమిచ్చింది. ఆలయంలోని శివలింగం వద్ద సుమారు గంట పాటు పడగ విప్పి నాగుపాము దర్శనం ఇవ్వడంతో గ్రామస్థులు సాక్షాత్తు శివుడు దర్శనమిచ్చాడని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంటపాటు శివుడి వద్ద పడగవిప్పి ఉండడంతో యువకులు నాగుపాము ఫోటోలు సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు.

News April 8, 2025

BREAKING: శామీర్‌పేటలో యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

image

శామీర్‌పేట్‌లోని జీనోమ్ వ్యాలీ PS పరిధిలో లాల్‌గడి మలక్‌పేట్ హైవేపై సఫారీ కారు, డీసీఎం ఢీ కొన్నాయి. సఫారీ వాహనం సిద్దిపేట నుంచి నగరానికి వస్తుండగా డివైడర్‌కు తగిలి ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఏడుగురికి గాయాలయ్యాయి. మృతులు సిద్దిపేట జిల్లా వర్గల్‌కు చెందిన రాజు, తుర్కపల్లి పరిధి మురహరిపల్లికి చెందిన శ్రవణ్‌‌గా పోలీసులు గుర్తించారు.

error: Content is protected !!