News April 6, 2025

స్టేషన్ ఘనపూర్: విద్యుత్ షాక్‌తో బీపీఎం మృతి

image

స్టేషన్ ఘనపూర్ మండలం మీదికొండలో బీపీఎంగా పని చేస్తున్న బోడావుల నాగదుర్గ బాలాజీ (26) విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు సీఐ వేణు తెలిపారు. ఏపీలోని ఏలూరు జిల్లా కైకలూరు మండలం నర్సాయపాలెం గ్రామానికి చెందిన బాలాజీ 15 నెలల క్రితం మీదికొండలో పోస్టుమాస్టర్‌గా విధుల్లో చేరాడు. స్టేషన్ ఘనపూర్‌లో నివాసం ఉంటున్న ఆయన నీళ్ల కోసం మోటార్ ఆన్ చేయగా విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు సీఐ చెప్పారు.

Similar News

News April 9, 2025

శుభ ముహూర్తం (09-04-2025)(బుధవారం)

image

తిథి: శుక్ల ద్వాదశి రా.11.56 వరకు
నక్షత్రం: మఖ ఉ.11.16 వరకు
రాహుకాలం: మ.12.00-మ.1.30 వరకు
యమగండం: ఉ.7.30-ఉ.9.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.36-ఉ.12.24 వరకు
వర్జ్యం: రా.7.49-రా.9.31 గంటల వరకు
అమృత ఘడియలు: ఉ.9.08-ఉ.10.48 వరకు

News April 9, 2025

WGL: పలు సూచనలు చేసిన వాతావరణ శాఖ అధికారులు

image

వరంగల్ జిల్లా వాతావరణ శాఖ అధికారులు పలు సూచనలు చేశారు. వరంగల్ జిల్లాలోకి ఇప్పుడు తీవ్రమైన తుఫాను కదులుతుందని తెలిపారు. ప్రస్తుతానికి మహబూబాబాద్‌తో పాటు పలు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో రాబోయే రెండు గంటల్లో తీవ్రమైన తుఫానులు, గాలులు విస్తరించబోతున్నాయని పేర్కొన్నారు. కాగా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News April 9, 2025

ఏప్రిల్ 10 నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

image

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

error: Content is protected !!