News April 6, 2025
తెలుగు తెరపై శ్రీరాముడి పాత్రలు

Y సూర్యనారాయణ(శ్రీరామపాదుకా పట్టాభిషేకం), P సుబ్బారావు(లవకుశ-మొదటిది), ANR(సీతారామజననం), CSR ఆంజనేయులు(పాదుకా పట్టాభిషేకం) NTR(సంపూర్ణ రామాయణం(తమిళం), లవకుశ, రామాంజనేయ యుద్ధం, శ్రీరామ పట్టాభిషేకం), శోభన్‌బాబు(భక్తపోతన, సంపూర్ణ రామాయణం), హరనాథ్ (సీతారామ కళ్యాణం, శ్రీరామకథ), కాంతారావు(వీరాంజనేయ), NBK (శ్రీరామరాజ్యం), Jr.NTR (రామాయణం), సుమన్(శ్రీరామదాసు), శ్రీకాంత్(దేవుళ్లు), ప్రభాస్(ఆదిపురుష్).
Similar News
News April 9, 2025
‘ఓజీ’లో అకీరా నందన్.. రేణూ దేశాయ్ స్పందనిదే

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ మూవీలో అకీరా నందన్ నటిస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై నటి రేణూ దేశాయ్ ఓ పాడ్ కాస్ట్‌లో స్పందించారు. ‘అకీరా ప్రస్తుతం ఏ మూవీలోనూ నటించడం లేదు. ఆయన తండ్రి పవన్ నటిస్తున్న ‘ఓజీ’లోనూ ఆయన లేరు. ఒకవేళ అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే నేనే సోషల్ మీడియాలో ప్రకటిస్తా. ప్రస్తుతం వైరల్ అవుతోన్న వార్తలన్నీ నిరాధారం’ అని ఆమె స్పష్టం చేశారు.
News April 9, 2025
చైనాకు ట్రంప్ భారీ షాక్.. చెప్పినట్లే భారీ సుంకాలు

చైనా తమపై విధించిన ప్రతీకార సుంకాల విషయంలో వెనక్కి తగ్గకపోతే ఆ దేశంపై టారిఫ్స్‌ను 104శాతానికి పెంచుతానన్న ట్రంప్, అదే చేశారు. తన హెచ్చరికల్ని లైట్ తీసుకున్న చైనాపై అదనంగా 50శాతం సుంకాలు విధించారు. దీంతో ఆ దేశంపై అమెరికా మొత్తం టారిఫ్‌లు 104శాతానికి చేరాయి. దీనిపై చైనా స్పందించాల్సి ఉంది. ఈ వాణిజ్య యుద్ధం ఎక్కడకు దారి తీస్తుందోనని ఆర్థిక వేత్తల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.
News April 9, 2025
TG మాజీ గవర్నర్ తమిళిసైకు పితృవియోగం

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైకి పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి, తమిళనాడు కాంగ్రెస్‌లో సీనియర్ లీడరైన కుమారి అనంతన్(93) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో ఈరోజు పరిస్థితి విషమించి మరణించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.