News April 6, 2025
శ్రీరామనవమికి సంగారెడ్డి జిల్లాలో పటిష్ట బందోబస్తు: ఎస్పీ

సంగారెడ్డి జిల్లాలో శ్రీరామ నవమి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. మత సంప్రదాయాలను మరొకరు గౌరవించినప్పుడే మతసామరస్యం నెలకొంటుందని తెలిపారు. జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డి పట్టణాలలో శ్రీరామనవమి ఏర్పాట్లు బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు.
Similar News
News April 9, 2025
శుభ ముహూర్తం (09-04-2025)(బుధవారం)

తిథి: శుక్ల ద్వాదశి రా.11.56 వరకు
నక్షత్రం: మఖ ఉ.11.16 వరకు
రాహుకాలం: మ.12.00-మ.1.30 వరకు
యమగండం: ఉ.7.30-ఉ.9.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.36-ఉ.12.24 వరకు
వర్జ్యం: రా.7.49-రా.9.31 గంటల వరకు
అమృత ఘడియలు: ఉ.9.08-ఉ.10.48 వరకు
News April 9, 2025
WGL: పలు సూచనలు చేసిన వాతావరణ శాఖ అధికారులు

వరంగల్ జిల్లా వాతావరణ శాఖ అధికారులు పలు సూచనలు చేశారు. వరంగల్ జిల్లాలోకి ఇప్పుడు తీవ్రమైన తుఫాను కదులుతుందని తెలిపారు. ప్రస్తుతానికి మహబూబాబాద్‌తో పాటు పలు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో రాబోయే రెండు గంటల్లో తీవ్రమైన తుఫానులు, గాలులు విస్తరించబోతున్నాయని పేర్కొన్నారు. కాగా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News April 9, 2025
ఏప్రిల్ 10 నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.