News April 6, 2025
ముస్లింలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది: ఎమ్మెల్సీ కవిత

TG: వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ‘కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కారణంగానే బీజేపీ సర్కారు బిల్లును ఆమోదింపజేసుకుంది. ముస్లింలకు తీవ్ర నష్టం చేకూర్చే ఈ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలి. మైనారిటీల తరఫున మా పార్టీ పోరాడుతుంది. గతంలోనూ వారి అభివృద్ధి, సంక్షేమానికి మేం కృషి చేశాం’ అని గుర్తుచేశారు.
Similar News
News April 9, 2025
ఈరోజు ఎన్టీఆర్-నీల్ మూవీపై అప్‌డేట్

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్, సలార్ వంటి సినిమాలు తీసిన నీల్ తమ హీరోను ఎలా చూపిస్తారా అని తారక్ ఫ్యాన్స్ ఇంట్రస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు. వారికి మూవీ సర్ప్రైజ్ న్యూస్ చెప్పింది. ఈరోజు మధ్యాహ్నం 12.06 గంటలకు సినిమాకు సంబంధించి బిగ్ అప్‌డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ అప్‌డేట్ ఏంటా అన్న ఆసక్తి నెలకొంది.
News April 9, 2025
ధోనీ ఔటయ్యారని భోరున విలపించింది!

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ పోరాడినప్పటికీ చెన్నైని గెలిపించలేకపోయారు. అయితే ఉన్నంత సేపు తన అభిమానుల్ని ఉర్రూతలూగించారు. కాగా.. ధోనీ ఔటైనప్పుడు ఓ అభిమాని భోరున విలపించింది. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 12 బంతులాడిన MS 3 సిక్సులు, ఒక ఫోర్‌తో 27 రన్స్ చేశారు. 43 ఏళ్ల వయసులోనూ ఆయనలో ఇదివరకటి ఆట ఇంకా అలాగే ఉందంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
News April 9, 2025
రేపటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

రేపటి నుంచి ఈ నెల 12 వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. చైత్ర శుద్ధ పౌర్ణమికి ముగిసేవిధంగా ప్రతి ఏడాదీ ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తున్నారు. స్వామివారికి వసంత ఋతువులో జరిగే ఉత్సవం కాబట్టి ‘వసంతోత్సవ’మని పేరు వచ్చింది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో రేపటి తిరుప్పావడ సేవ, 10-12 తేదీల మధ్యలో కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను TTD రద్దు చేసింది.