News April 6, 2025
ALERT: రేపు, ఎల్లుండి వర్షాలు

TG: ద్రోణి కారణంగా వచ్చే 2రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో రేపు.. వీటితో పాటు సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌లో ఎల్లుండి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది.
Similar News
News April 9, 2025
రేపటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

రేపటి నుంచి ఈ నెల 12 వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. చైత్ర శుద్ధ పౌర్ణమికి ముగిసేవిధంగా ప్రతి ఏడాదీ ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తున్నారు. స్వామివారికి వసంత ఋతువులో జరిగే ఉత్సవం కాబట్టి ‘వసంతోత్సవ’మని పేరు వచ్చింది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో రేపటి తిరుప్పావడ సేవ, 10-12 తేదీల మధ్యలో కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను TTD రద్దు చేసింది.
News April 9, 2025
ఒకే జిల్లాల్లో 13,500మందిలో క్యాన్సర్ లక్షణాలు!

మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో సర్కారు నిర్వహించిన ‘సంజీవని అభిమాన్’ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల్లో 13,500కు పైగా మహిళలు క్యాన్సర్ ముప్పు ముంగిట ఉన్నట్లు తేలింది. జిల్లా కలెక్టర్ అభివన్ గోయెల్ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘7వేలమందిలో గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు, 3500మందిలో రొమ్ము క్యాన్సర్, 2వేల మందిలో నోటి క్యాన్సర్, వెయ్యి మందిలో ఇతర క్యాన్సర్ల లక్షణాల్ని వైద్యులు గుర్తించారు’ అని తెలిపారు.
News April 9, 2025
బ్రిటన్ యువరాజు ప్రాణాలకు ముప్పు: లాయర్

బ్రిటన్ యువరాజు హ్యారీ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన తరఫు న్యాయవాది ఫాతిమా లండన్ కోర్టుకు తెలిపారు. హ్యారీ తన భార్యతో కలిసి 2020లో అమెరికాకు షిఫ్ట్ అయ్యారు. ఆయన బ్రిటన్ వచ్చినప్పుడు కల్పించే భద్రతను ప్రభుత్వం భారీగా తగ్గించింది. ఈ నేపథ్యంలోనే హ్యారీ కోర్టును ఆశ్రయించారు. ‘హ్యారీని చంపాలంటూ ఆల్ ఖైదా ఈమధ్యే పిలుపునిచ్చింది. ఇక ఆయన్ను, ఆయన భార్యను మీడియా డేగలా వెంటాడుతోంది’ అని ఫాతిమా వివరించారు.