News April 6, 2025

మావోయిస్టులు లొంగిపోవడానికి కారణం?

image

మావోయిస్టులు గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో లొంగిపోతున్నారు. వారి లొంగుబాట్లకు కారణాలేంటన్నదానిపై వివిధ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దళ సభ్యుల మధ్య విభేదాలు, సీనియర్లలో వయోభారం, నేటి కాలంలో సిద్ధాంతాలు ఇమడటం లేదన్న భావం, ప్రజల మద్దతు లభించకపోవడం, బలగాల దాడుల తీవ్రత పెరగడం.. ఇలాంటివన్నీ కలగలిసి మావోయిస్టులు లొంగిపోయేందుకు మొగ్గుచూపిస్తున్నారన్న వాదనలున్నాయి. మీరేమనుకుంటున్నారు?

Similar News

News April 9, 2025

ఒకే జిల్లాల్లో 13,500మందిలో క్యాన్సర్ లక్షణాలు!

image

మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో సర్కారు నిర్వహించిన ‘సంజీవని అభిమాన్’ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల్లో 13,500కు పైగా మహిళలు క్యాన్సర్ ముప్పు ముంగిట ఉన్నట్లు తేలింది. జిల్లా కలెక్టర్ అభివన్ గోయెల్ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘7వేలమందిలో గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు, 3500మందిలో రొమ్ము క్యాన్సర్, 2వేల మందిలో నోటి క్యాన్సర్, వెయ్యి మందిలో ఇతర క్యాన్సర్ల లక్షణాల్ని వైద్యులు గుర్తించారు’ అని తెలిపారు.

News April 9, 2025

బ్రిటన్ యువరాజు ప్రాణాలకు ముప్పు: లాయర్

image

బ్రిటన్ యువరాజు హ్యారీ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన తరఫు న్యాయవాది ఫాతిమా లండన్ కోర్టుకు తెలిపారు. హ్యారీ తన భార్యతో కలిసి 2020లో అమెరికాకు షిఫ్ట్ అయ్యారు. ఆయన బ్రిటన్ వచ్చినప్పుడు కల్పించే భద్రతను ప్రభుత్వం భారీగా తగ్గించింది. ఈ నేపథ్యంలోనే హ్యారీ కోర్టును ఆశ్రయించారు. ‘హ్యారీని చంపాలంటూ ఆల్ ఖైదా ఈమధ్యే పిలుపునిచ్చింది. ఇక ఆయన్ను, ఆయన భార్యను మీడియా డేగలా వెంటాడుతోంది’ అని ఫాతిమా వివరించారు.

News April 9, 2025

‘ఓజీ’లో అకీరా నందన్.. రేణూ దేశాయ్ స్పందనిదే

image

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ మూవీలో అకీరా నందన్ నటిస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై నటి రేణూ దేశాయ్ ఓ పాడ్ కాస్ట్‌లో స్పందించారు. ‘అకీరా ప్రస్తుతం ఏ మూవీలోనూ నటించడం లేదు. ఆయన తండ్రి పవన్ నటిస్తున్న ‘ఓజీ’లోనూ ఆయన లేరు. ఒకవేళ అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే నేనే సోషల్ మీడియాలో ప్రకటిస్తా. ప్రస్తుతం వైరల్ అవుతోన్న వార్తలన్నీ నిరాధారం’ అని ఆమె స్పష్టం చేశారు.

error: Content is protected !!