News April 6, 2025
ట్రోలింగ్ వల్ల వారికి ఏం ఆనందం వస్తుందో: మోహన్ బాబు

ట్రోలింగ్‌ను తాను పట్టించుకోనని నటుడు మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఎదుటివాళ్లు నాశనమవ్వాలని కోరుకోకూడదు. అలా కోరుకుంటే వాళ్లకంటే ముందు మనమే నాశనమవుతాం. అందరూ క్షేమంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఈ ట్రోలింగ్ చేసేవారికి దాని వల్ల ఏం ఆనందం వస్తుందో అర్థంకాదు. అయితే ఎవర్నీ నిందించను. దేవుడి ఆశీస్సులతో ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ పిల్లలతో హాయిగా ఉండాలనుకుంటున్నాను అంతే’ అని తెలిపారు.
Similar News
News April 9, 2025
బీమా కంపెనీలకు సుప్రీం కీలక ఆదేశాలు

ఆచరణసాధ్యం కాని షరతులు విధించి క్లెయిమ్స్‌ను ఎగవేయడం సరికాదని బీమా కంపెనీలకు సుప్రీం కోర్టు చురకలంటించింది. షరతుల్ని పాటించలేదన్న పేరుతో బీమా చెల్లింపుల్ని తిరస్కరించడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. బీమా కంపెనీలు నిజాయితీగా, పారదర్శకంగా వ్యవహరించాలని పేర్కొంది. సోహోం షిప్పింగ్ సంస్థకు, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థకు మధ్య నడుస్తున్న కేసు విచారణ సందర్భంగా సుప్రీం ఈమేరకు తీర్పునిచ్చింది.
News April 9, 2025
11న ఒంటిమిట్టకు చంద్రబాబు దంపతులు

AP: సీఎం చంద్రబాబు కుటుంబసమేతంగా ఈ నెల 11న వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో పర్యటించనున్నారు. ఆ రోజున సాయంత్రం ప్రత్యేక విమానంలో కడపకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఒంటిమిట్టకు వెళతారు. కోదండరామ స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
News April 9, 2025
వచ్చే నెలలో అయోధ్య రాముడికి పట్టాభిషేకం

అయోధ్యలో వచ్చే నెలలో శ్రీరామచంద్రుడి పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నెలాఖరులోగా ఆలయంలోని మొదటి అంతస్తులో రామ దర్బార్‌ను ఏర్పాటు చేయనున్నారు. దర్బారుకు సంబంధించిన పాలరాతి విగ్రహాలను జైపూర్‌లో శిల్పి ప్రశాంత్ పాండే తీర్చిదిద్దుతున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి. పట్టాభిషేకానికి పరిమితంగా మాత్రమే అతిథుల్ని ఆహ్వానించనున్నట్లు సమాచారం.