News April 6, 2025

తెలంగాణ కొత్త సీఎస్ ఆయనేనా?

image

TG: సీఎస్ శాంతికుమారి ఈనెలాఖరున రిటైర్ కానున్న నేపథ్యంలో తదుపరి సీఎస్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ఐఏఎస్ రామకృష్ణారావును సీఎస్‌గా నియమించాలని CM రేవంత్ నిర్ణయించినట్లు సమాచారం. ఆర్థిక శాఖలో సుదీర్ఘ అనుభవం, రాష్ట్ర పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండడంతో ఆయనవైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు శాంతికుమారి వీఆర్ఎస్ తీసుకుంటారని, ఆమెకు ఆర్టీఐ చీఫ్ కమిషనర్ పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Similar News

News April 9, 2025

మ్యాక్స్‌వెల్‌కు షాక్.. డీమెరిట్ పాయింట్, 25% ఫైన్ విధింపు

image

PBKS ప్లేయర్ మ్యాక్స్‌వెల్‌కు IPL యాజమాన్యం షాకిచ్చింది. మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫైన్ విధించడంతోపాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను అతని ఖాతాలో చేర్చింది. నిన్న CSKతో మ్యాచ్‌లో ఒక్క పరుగుకే ఔటైన అతను క్రికెట్ వస్తువులు, గ్రౌండ్ ఎక్విప్‌మెంట్‌ను దుర్భాషలాడినట్లు సమాచారం. ఇటీవల ఇషాంత్ శర్మకు సైతం ఇవే కారణాలతో ఫైన్, డీమెరిట్ పాయింట్ విధించారు. కాగా 4 డీమెరిట్ పాయింట్లకు ఒక మ్యాచ్ నిషేధం ఉంటుంది.

News April 9, 2025

సీఎం చంద్రబాబు కొత్త ఇంటికి భూమిపూజ

image

AP: రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న తన కొత్త ఇంటికి సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. వెలగపూడి సచివాలయం వెనుక వైపు E-9 రోడ్ పక్కన ఈ ఇంటి నిర్మాణం చేపట్టారు. మొత్తం 1,455 చ.గజాల విస్తీర్ణంలో జీ+1 పద్ధతిలో నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేయాలని సీఎం కుటుంబసభ్యులు భావిస్తున్నారు. కాగా గతేడాది వెలగపూడి రెవెన్యూ పరిధిలో చంద్రబాబు 5 ఎకరాల స్థలం కొన్న విషయం తెలిసిందే.

News April 9, 2025

GOOD NEWS: గురుకులాల్లో కోడింగ్ కోర్సులు

image

TG: వచ్చే విద్యాసంవత్సరం నుంచి 238 గురుకులాల్లో కోడింగ్ కోర్సులను అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆరో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు ఈ శిక్షణ ఇస్తామని చెప్పారు. ఇందుకోసం యూకే ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. గతేడాది మెయినాబాద్ పాఠశాలలో మాత్రమే కోడింగ్ ట్రైనింగ్ ఉండేదని, ఇకపై అన్ని గురుకులాల్లో అమలు చేస్తామన్నారు.

error: Content is protected !!