News April 6, 2025

నేడు భద్రాద్రికి సీఎం రేవంత్ రెడ్డి

image

CM రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటన ఖరారైంది. నేడు ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో సారపాకలోని గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. 10:30కు భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకుంటారు. 11:10 నుంచి 12.30 వరకు మిథిలా స్టేడియంలో జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. 12:35కు సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారుడి నివాసంలో భోజనం చేయనున్నారు. అనంతరం ఐటీసీ గెస్ట్ హౌస్ నుంచి HYDకు తిరుగుపయనమవుతారు.

Similar News

News April 9, 2025

పులివెందుల: MLC V/S మాజీ MLC

image

కడప జిల్లాలో TDPని బలోపేతం చేయాలనే ఆ పార్టీ పెద్దల ఆకాంక్ష.. స్థానిక నేతల వర్గపోరుతో తీరేలా కనిపించడం లేదు. ఈ మధ్య కాలంలో మాజీ MLC బీటెక్ రవి, MLC రాంగోపాల్ రెడ్డి వర్గీయుల మధ్య ఆధిపత్యం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల వీరి వర్గీయులు ఘర్షణలకు దిగారు. మంగళవారం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత ఎదుటే ఒకరిపై ఒకరు బాహాబాహికి దిగారు. దీంతో జిల్లా TDP సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

News April 9, 2025

ప్రముఖ నిర్మాత మృతి

image

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సలీమ్ అక్తర్(87) నిన్న అర్ధరాత్రి మరణించారు. అనారోగ్య సమస్యలతో ముంబైలోని ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రాణీ ముఖర్జీ, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈయనే. ఆమిర్ ఖాన్, బాబీ డియోల్, మిథున్ చక్రవర్తి తదితర అగ్ర నటులతో సినిమాలు చేశారు. కాగా ఇటీవల ప్రముఖ ప్రొడ్యూసర్ మనోజ్ కుమార్ కూడా మృతిచెందిన విషయం తెలిసిందే.

News April 9, 2025

దేశానికి కాంగ్రెస్ చాలా అవసరం: షర్మిల

image

AP: దేశానికి కాంగ్రెస్ పార్టీ అత్యవసరమని APCC అధ్యక్షురాలు YS షర్మిల అన్నారు. అహ్మదాబాద్‌లో AICC సమావేశాల సందర్భంగా ఆమె బీజేపీపై మండిపడ్డారు. ‘బీజేపీ చేసేవే మత రాజకీయాలు. దేశ ప్రజల్ని విభజించి పాలించడమే ఆ పార్టీకి తెలుసు. మతం పేరిట మంట పెట్టి చలి కాచుకుంటోంది. వ్యవస్థల్ని సొంత అవసరాలకు వాడుకుంటోంది. కాంగ్రెస్‌తోనే ఈ దేశ అభివృద్ధి సాధ్యం. ఏపీలో కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తాం’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!