News April 6, 2025
అధ్యక్ష బాధ్యతల వల్ల భార్యకు దూరమయ్యా: ఒబామా

ఒబామా అమెరికా అధ్యక్షుడిగా 8 ఏళ్ల పాటు సేవలందించారు. ఆ సమయంలో తన భార్య మిషెల్‌కు దూరమయ్యానని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘అధ్యక్ష బాధ్యతల కారణంగా మిషెల్‌కు ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోయాను. దీంతో మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఒకానొక సమయంలో మ్యారేజ్ కౌన్సిలర్‌ను కూడా కలిశాం. అధ్యక్షుడిగా దిగిపోయాక ఇప్పుడు ఆమెతోనే ఎక్కువ ఉంటున్నాను. మా బంధం మెరుగైంది’ అని వెల్లడించారు.
Similar News
News April 9, 2025
BREAKING: తైవాన్‌లో భూకంపం

తైవాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.8 మాగ్నిట్యూడ్ నమోదైంది. భూకంప ధాటికి రాజధాని తైపీలో భవనాలు షేక్ అయ్యాయి. 73 కి.మీ లోతులో భూమి కంపించిందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. నష్ట తీవ్రతపై వివరాలు తెలియాల్సి ఉంది. కాగా వివిధ దేశాల్లో వరుస భూకంపాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల మయన్మార్, థాయిలాండ్‌లో భూకంపాల ధాటికి వేలాది మంది మరణించిన విషయం తెలిసిందే.
News April 9, 2025
రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్.. రేపటి నుంచే

TG: రిజిస్ట్రేషన్ల కోసం గంటలకొద్దీ వెయిట్ చేయకుండా, దళారుల ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. రేపటి నుంచి ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ప్రక్రియను అమలు చేయనుంది. రోజుకు 48 స్లాట్‌ల చొప్పున అందుబాటులో ఉంటాయి. ఇంటి నుంచే registration.telangana.gov.inలో స్లాట్ బుక్ చేసుకుని వెళితే 10-15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
News April 9, 2025
రేషన్ షాపుల ద్వారా చిరు ధాన్యాల సరఫరా: నాదెండ్ల

AP: జూన్ నుంచి 40వేల GOVT స్కూళ్లు, 4వేల హాస్టళ్లకు నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రేషన్ షాపుల ద్వారా చిరు ధాన్యాల సరఫరా, రైతు బజార్లలో చౌక ధరల దుకాణాల ఏర్పాటుపై కేంద్రంతో చర్చించినట్లు తెలిపారు. ఉజ్వల యోజన కింద రాష్ట్రంలో ఉన్న 9.65L లబ్ధిదారులను 65.40 లక్షలకు పెంచేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందన్నారు. దీనివల్ల ఏటా ₹587Cr రాయితీ అందుతుందని చెప్పారు.