News April 6, 2025
‘మునుగోడులో ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ ఉంది’

మునుగోడు నియోజకవర్గం ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతమని స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ట్యాంకుల్లో బోరు, భగీరథ నీళ్లు కలుస్తున్నాయని, దీనికి స్వస్తి పలకాలన్నారు. శుద్ధి చేసిన తాగునీరందేలా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. అధికారులు, నాయకులు అలర్ట్‌గా ఉండి తాగునీటి సమస్య లేకుండా చూడాలని పేర్కొన్నారు.
Similar News
News April 15, 2025
SRPT: కొడుకుతో బావిలో దూకి తల్లి ఆత్మహత్య

సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగింది. చిలుకూరు మండలం కొత్తకొండాపురంలో బావిలో దూకి తల్లి వీరమ్మ, కుమారుడు నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజుల క్రితమే వీరమ్మ అన్న నాగేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందగా.. తమ బాగోగులు చూసేవారు లేరని మనస్తాపం చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
News April 15, 2025
పొలంలో బయటపడ్డ పురాతన శివలింగం

సూర్యాపేట జిల్లాలో పొలం చదును చేస్తుండగా పురాతన శివలింగం బయటపడింది. చివ్వెంల మండలం తిమ్మాపురంలో రణబోతు బాధిరెడ్డి తన వ్యవసాయ భూమిలో జేసీబీతో చదును చేయిస్తుండగా పురాతన శివలింగంతో పాటు నాగపడిగ విగ్రహాలు జేసీబీకి తగలడంతో వాటిని జాగ్రత్తగా తీసి పక్కకు పెట్టి శుభ్రం చేశారు. తిమ్మాపురంతో పాటు, మోదీన్‌పురం పరిసర గ్రామాల నుంచి శివభక్తులు అక్కడకు చేరుకుని క్షీరాభిషేకం చేసి పూజలు నిర్వహించారు.
News April 15, 2025
చీకోటి ప్రవీణ్‌పై నల్గొండలో కేసు నమోదు

బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ కుమార్‌పై నల్గొండ వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. నల్గొండలో జరిగిన హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న చీకోటి ప్రవీణ్ కుమార్ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులొచ్చాయి. దీంతో అతనిపై 188, 153 సెక్షన్ల కింద నల్గొండ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.