News April 6, 2025

భద్రాద్రి జిల్లాకు ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ

image

భద్రాద్రి జిల్లాలో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు. మైనింగ్ కళాశాలను అప్ గ్రేడ్ చేస్తూ యూనివర్సిటీగా మారుస్తున్నట్లు చెప్పారు. అన్ని సహజ వనరులు మెరుగైన అవకాశాలు ఉన్న మైనింగ్ కళాశాలను ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా అప్ గ్రేడ్ చేయాలని మంత్రి పలుమార్లు సీఎంకు వినతి పత్రాలు అందచేసిన విషయం తెలిసిందే.

Similar News

News April 9, 2025

దేశానికి కాంగ్రెస్ చాలా అవసరం: షర్మిల

image

AP: దేశానికి కాంగ్రెస్ పార్టీ అత్యవసరమని APCC అధ్యక్షురాలు YS షర్మిల అన్నారు. అహ్మదాబాద్‌లో AICC సమావేశాల సందర్భంగా ఆమె బీజేపీపై మండిపడ్డారు. ‘బీజేపీ చేసేవే మత రాజకీయాలు. దేశ ప్రజల్ని విభజించి పాలించడమే ఆ పార్టీకి తెలుసు. మతం పేరిట మంట పెట్టి చలి కాచుకుంటోంది. వ్యవస్థల్ని సొంత అవసరాలకు వాడుకుంటోంది. కాంగ్రెస్‌తోనే ఈ దేశ అభివృద్ధి సాధ్యం. ఏపీలో కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తాం’ అని పేర్కొన్నారు.

News April 9, 2025

VZM: ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లపై విచారణ

image

ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లపై పలువురు వేతనదారులు ఫిర్యాదులు చేస్తున్నారు. వారానికి రూ.100 వసూలు చేస్తున్నట్లు, పనికి రాకున్నా మస్తర్లు వేసినట్లు వంగర మండలం సంగం, శివ్వం వేతనదారులు ఫీల్డు అసిస్టెంట్లపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మంగళవారం దర్యాప్తు చేపట్టారు. ఆ గ్రామ సచివాలయాల్లో వేతనదారులతో అధికారులు సమావేశమయ్యారు. నివేదికను పైఅధికారులకు పంపిస్తామని వెల్లడించారు.

News April 9, 2025

శ్రీకాకుళం జిల్లా వాసుల తలపై గుది బండ

image

గ్యాస్ ధరల పెంపు సామాన్యుడి తలపై గుది బండలా మారింది. గృహ అవసరాలకు వాడే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఏకంగా రూ. 50 పెరగడంతో.. రూ. 878.50 కి చేరింది. మన శ్రీకాకుళం జిల్లాలో 6.92 లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. పెంచిన ధరతో నెలకు రూ. 3.46 కోట్లకు పైగా ప్రజలపై భారం పడనుంది. వాణిజ్య పనులకు ఉపయోగించే గ్యాస్ సిలిండరుపై రూ. 40 పెరిగింది.

error: Content is protected !!