News April 6, 2025
టెక్కలి: ఇద్దరు ఆడపిల్లలతో అత్తింటి ముందు నిరసన

ఆడపిల్లలు పుట్టారనే నెపంతో తనను ఇంట్లోకి రానివ్వడం లేదని ఓ వివాహిత శనివారం తన అత్త వారి ఇంటి ముందు నిరసన చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. బుడ్డిపేటకి చెందిన మెట్ట గోపాలకృష్ణతో పోలవరం గ్రామానికి చెందిన రాణికి 2017లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రెండేళ్లుగా రాణి తన కన్నవారింట్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో అత్తవారి ఇంటికి వెళ్లగా వారు లోనికి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
Similar News
News April 9, 2025
శ్రీకాకుళం జిల్లా వాసుల తలపై గుది బండ

గ్యాస్ ధరల పెంపు సామాన్యుడి తలపై గుది బండలా మారింది. గృహ అవసరాలకు వాడే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఏకంగా రూ. 50 పెరగడంతో.. రూ. 878.50 కి చేరింది. మన శ్రీకాకుళం జిల్లాలో 6.92 లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. పెంచిన ధరతో నెలకు రూ. 3.46 కోట్లకు పైగా ప్రజలపై భారం పడనుంది. వాణిజ్య పనులకు ఉపయోగించే గ్యాస్ సిలిండరుపై రూ. 40 పెరిగింది.
News April 9, 2025
ఎచ్చెర్లలో ఇద్దరు అమ్మాయిలు మిస్సింగ్

ఎచ్చెర్లలో ఇద్దరు అమ్మాయిలు మిస్ అయ్యారని ఎచ్చెర్ల ఎస్.ఐ సందీప్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. చెరుకూరి తిరుపతమ్మ (21), బేపల అనూష (18) లు ఎచ్చెర్లలోని శక్తి సదన్ మహిళా ప్రాంగణంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొందుతున్నారని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం భోజన విరామం సమయం నుంచి కనిపించడం లేదన్నారు. ఆచూకీ తెలిసిన వారు ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ నెంబర్ 63099 90816కు సమాచారం అందజేయాలని స్పష్టం చేశారు.
News April 9, 2025
SKLM: ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి సమీక్ష

శ్రీకాకుళం జిల్లాలోని రోడ్డు రైల్వేలకు సంబంధించిన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశం అయ్యారు. ఈ మేరకు మంగళవారం విశాఖపట్నంలో జాతీయ రహదారులు & రైల్వే DRM Waltair అధికారులతో కీలక నిర్ణయాలపై చర్చించారు. ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పనులు వేగవంతం చేసి ప్రజలకు సకాలంలో అందించడానికి కృషి చేయాలని కేంద్ర మంత్రి అధికారులను ఆదేశించారు.