News April 6, 2025
అన్నమయ్య జిల్లాలో వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

మైనర్ బాలికను మోసంచేసి పిల్లలు కలిగేలా చేసిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు బీ కొత్తకోట సీఐ జీవన్ గంగానాథ బాబు తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామంలోని వ్యక్తి మాయమాటలతో లొంగదీసుకుని గర్భం దాల్చేలా చేసినట్లు చెప్పారు. అనంతరం ఆమెను తీసుకెళ్లి కర్ణాటకలో అబార్షన్ చేయించడానికి ప్రయత్నించడంతో అక్కడి పోలీసులు ఇచ్చిన సమాచారంతో పోక్సో కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News April 9, 2025
అమలాపురం: పెరిగిన గ్యాస్ ధరలతో మహిళల కన్నీళ్లు

రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం గ్యాస్ ధరలను పెంచింది. ఒక్కో సిలిండర్ రూ.50 పెరిగింది. ఇది మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. మొత్తం 17.97 లక్షల గ్యాస్ కనెక్షన్‌లు ఉండగా వినియోగదారులు రూ.8.98 లక్షలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. కోనసీమ జిల్లాలో 5.30 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. రూ.881కి సిలెండర్ ధర చేరడంతో మహిళలు వాపోతున్నారు.
News April 9, 2025
కారు బోల్తా.. TU విద్యార్థిని మృతి

KMR జిల్లా గాంధారి మండలం మాధవపల్లి వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చిన్నగుట్ట తండాకు చెందిన అంజలి పూజ(22) మృతి చెందింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నగుట్ట తండాకు చెందిన 5గురు HYD నుంచి కారులో స్వగ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో అడవిపంది అడ్డువచ్చింది. దీంతో ఒక్కసారిగా కారు బోల్తా కొట్టింది. ఈఘటలో అంజలి పూజ మృతి చెందింది. అంజలి పూజ టీయూ సౌత్ క్యాంపస్‌లో చదువుకుంటోంది.
News April 9, 2025
ఓయూలో 470 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు!

ఉస్మానియా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 601 మంజూరు పోస్టులకు గాను 131 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 470 ఖాళీలు ఉన్నాయి. అకాడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో సగమే భర్తీ చేస్తారని సమాచారం.