News April 6, 2025
కడప జిల్లాలో వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

మైనర్ బాలికను మోసంచేసి పిల్లలు కలిగేలా చేసిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు బీ కొత్తకోట సీఐ జీవన్ గంగానాథ బాబు తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామంలోని వ్యక్తి మాయమాటలతో లొంగదీసుకుని గర్భం దాల్చేలా చేసినట్లు చెప్పారు. అనంతరం ఆమెను తీసుకెళ్లి కర్ణాటకలో అబార్షన్ చేయించడానికి ప్రయత్నించడంతో అక్కడి పోలీసులు, బాధితురాలి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News November 3, 2025
వైవీయూలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టు కోసం ఇంటర్వ్యూ

కడపలోని వైవీయూలో బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మేటిక్స్ విభాగానికి గెస్ట్ ఫ్యాకల్టీ కోసం ఈనెల 6న ఉదయం వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రధానాచార్యులు ప్రొ. టి.శ్రీనివాస్ తెలిపారు. అభ్యర్థులు బయోఇన్ఫర్మేటిక్స్ / బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మేటిక్స్ / ఎంటెక్ బయోఇన్ఫర్మేటిక్స్‌లో 5 ఏళ్ల MSc, నెట్/ సెట్/ పీహెచ్డీ అర్హత కలిగి ఉండాలన్నారు. మరిన్ని వివరాల కోసం yvu.edu.in ని సందర్శించాలన్నారు.
News November 3, 2025
ఒంటిమిట్ట రామాలయంలో TTD క్యాలెండర్లు

TTD 2026వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు ఒంటిమిట్ట కోదండ రామాలయంలో విక్రయిస్తున్నట్లు ఆలయ తనిఖీ అధికారి నవీన్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. రామయ్య దర్శనానికి వస్తున్న భక్తులకు TTD నిర్ణయించిన ధరల ప్రకారం విక్రయిస్తామన్నారు.
News November 3, 2025
ప్రపంచ కప్‌లో కడప అమ్మాయికి 14 వికెట్లు

భారత్ ప్రపంచ కప్ గెలవడంలో కడప జిల్లాకు చెందిన శ్రీచరణి(21) కీలక పాత్ర పోషించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఆమె జట్టులోకి అడుగు పెట్టారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా ఇప్పటి వరకు ఆమె 22 వికెట్ల పడగొట్టారు. వరల్డ్ కప్‌లోని 9 మ్యాచుల్లోనే 14 వికెట్లు తీయడం విశేషం. ఓ బాల్ స్పిన్, మరో బాల్ నేరుగా వేసి బ్యాటర్లను తికమకపెట్టారు. సెమీస్‌లో ఆస్ట్రేలియా స్కోర్ మరింత పెరగకుండా చివరి ఓవర్లు కట్టుదిట్టంగా వేశారు.


