News April 6, 2025
ఒంగోలు: మసాజ్ సెంటర్‌పై దాడులు

మసాజ్ సెంటర్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయని ఒంగోలు వాసులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు పోలీసు అధికారులు దాడులు నిర్వహించినప్పటికీ నిర్వాహకుల తీరులో మార్పు రావటం లేదని పేర్కొన్నారు. ఒంగోలులోని ఓ మసాజ్ సెంటర్ నిర్వాహకుడిపై ఒంగోలు తాలూకా సీఐ శ్రీనివాస్ రావు, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీలను అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News April 9, 2025
ప్రకాశం జిల్లాలో ముగ్గురు మృతి

ప్రకాశం జిల్లాలో వేరు వేరు ఘటనలలో మంగళవారం ముగ్గురు మృతి చెందారు. టంగుటూరు మండలం వల్లూరు జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం, బైక్‌ను ఢీకొట్టడంతో వర్ధన్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. టంగుటూరులోని రైల్వే గేట్ వద్ద విశ్రాంత ఆర్మీ ఉద్యోగి శ్రీనివాస్ పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడు. అర్ధవీడులో మద్యం మత్తులో కన్న తండ్రి, కుమారుడిని కత్తితో పొడవటంతో తీవ్రగాయాలతో షాకీర్ మృతి చెందాడు.
News April 9, 2025
ఒంగోలు: మేనకోడలిపై 4ఏళ్లుగా అఘాయిత్యం

సొంత మేనమామ మేనకోడలిపై 4 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ అఘాయిత్యాన్ని బాలిక తట్టుకోలేక ఒంగోలులోని తాలూకా పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఫిర్యాదు చేసింది. తల్లి అరబ్ దేశంలో పని కోసం వెళ్లింది. ఈ విషయాన్ని తల్లికి చెప్పుకున్న ఏమి చేయకపోవడంతో 4 సంవత్సరాలుగా మేనమామ చిత్రహింసలు భరిస్తూనే ఉంది. ప్రస్తుతం ఆ బాలిక ఇంటర్ పరీక్షలు రాసి పనిచేసుకుంటూ ఉంది. ఎస్సై కృష్ణ పావని కేసు దర్యాప్తు చేపట్టారు.
News April 9, 2025
ప్రకాశం: కూతురి బర్త్ డే.. తండ్రి సూసైడ్

కూతురి పుట్టిన రోజే తండ్రి ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన ఉమ్మడి ప్రకాశం జిల్లా వేటపాలెంలోని దేశాయిపేటలో జరిగింది. కానిస్టేబుల్ రమేశ్‌తో భార్య దూరంగా ఉంటూ కోర్టులో కేసు వేసింది. సోమవారం కోర్టుకు హాజరుకావాల్సిన ఆయన ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.