News April 6, 2025
NGKL: పండగను శాంతియుతంగా చేసుకోవాలి: కలెక్టర్

నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శ్రీరామ నవమి సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలందరిపై భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు శాంతియుతంగా ఆనందోత్సవాల మధ్య పండగను చేసుకోవాలన్నారు. ప్రకృతిని రక్షించాలని అప్పుడే మనం రాబోయే తరాలకు బంగారు భవిష్యత్తును అందించిన వారమవుతామని తెలిపారు.
Similar News
News April 9, 2025
నర్సీపట్నంలో అర్ధరాత్రి హత్య

నర్సీపట్నం మున్సిపాలిటీ అయ్యన్న కాలనీకి చెందిన ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసింది. మంగళవారం అర్ధరాత్రి ప్రసాద్, మహేశ్ అనే ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వారిని పంపించేశారు. పోలీసులు వెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య మళ్లీ ఘర్షణ జరిగి ప్రసాదును మహేశ్ కత్తితో పొడిచి హత్య చేశాడు. స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు.
News April 9, 2025
ఈనెల 16న జడ్పీ సర్వసభ్య సమావేశం: సీఈవో

ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 16వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పీ కార్య నిర్వాహక అధికారి నారాయణమూర్తి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం పదిన్నర గంటలకు జడ్పీ చైర్ పర్సన్ సుభద్ర అధ్యక్షతన సమావేశం జరుగుతుందన్నారు. అన్ని శాఖల అధికారులు సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.
News April 9, 2025
విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి: నిర్మల్ డీఈవో

ఎస్ఏ 2 పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నిర్మల్ డీఈవో రామారావు సూచించారు. ఈ నెల 9 నుంచి 17 వరకు పరీక్షలను నిర్వహించి పరీక్షా అనంతరం మూల్యాంకనం చేసి మార్కులను రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. ఈ నెల 23న పీటీఎం మీటింగ్ ఏర్పాటు చేసి విద్యార్థుల ఫలితాలను అందజేయాలని ఆదేశించారు.