News April 6, 2025
సఖినేటిపల్లి: కచ్చడా చేప రేటు అదుర్స్.. రూ.70 వేలు

సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్‌కు 25 కిలోల కచ్చడా చేప శనివారం మత్స్యకారులు తీసుకువచ్చారు. వేలంలో ఆ చేప రూ.70 వేల ధర పలికింది. దీంతో ఆ చేప చిక్కిన మత్స్యకారుల పంట పండింది. ఇది ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ చేప అని తెలిపారు. ఈ చేపకు ఇంత ధరా? అంటూ ఆశ్చర్యపోయిన స్థానికులు చేప వద్ద నిల్చొని సెల్ఫీలు తీసుకున్నారు.
Similar News
News April 9, 2025
ఈనెల 16న జడ్పీ సర్వసభ్య సమావేశం: సీఈవో

ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 16వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పీ కార్య నిర్వాహక అధికారి నారాయణమూర్తి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం పదిన్నర గంటలకు జడ్పీ చైర్ పర్సన్ సుభద్ర అధ్యక్షతన సమావేశం జరుగుతుందన్నారు. అన్ని శాఖల అధికారులు సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.
News April 9, 2025
విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి: నిర్మల్ డీఈవో

ఎస్ఏ 2 పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నిర్మల్ డీఈవో రామారావు సూచించారు. ఈ నెల 9 నుంచి 17 వరకు పరీక్షలను నిర్వహించి పరీక్షా అనంతరం మూల్యాంకనం చేసి మార్కులను రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. ఈ నెల 23న పీటీఎం మీటింగ్ ఏర్పాటు చేసి విద్యార్థుల ఫలితాలను అందజేయాలని ఆదేశించారు.
News April 9, 2025
IPL: తగ్గేదేలే.. విధ్వంసమే

గత రెండు రోజుల్లో జరిగిన 3 ఐపీఎల్ థ్రిల్లర్ మ్యాచ్‌లు అభిమానులకు మజానిచ్చాయి. 200కు పైగా పరుగులు చేసి ఆరు జట్లు విజయం కోసం చివరి బంతి వరకు పోరాడాయి. సీనియర్లతో పాటు యంగ్ ప్లేయర్లు తగ్గేదేలే అంటూ బౌలర్లపై విరుచుకుపడ్డారు. మొన్న RCB 221/5 స్కోర్ చేస్తే MI 209/9 పరుగులు చేసింది. నిన్న LSG విసిరిన 239 పరుగుల సవాల్‌కు KKR(234) దీటుగా బదులిచ్చింది. PBKS 219/6 స్కోర్ చేస్తే CSK 201/5 రన్స్ చేసింది.