News April 6, 2025

NGKL: పండగను ప్రజలు శాంతియుతంగా నిర్వహించుకోవాలి: SP

image

NGKL జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ శ్రీరామనవమి పండగను ప్రజలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు పండగల ప్రాధాన్యతను గుర్తించుకోవాలని సూచించారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం విశిష్ట లక్షణమని తెలిపారు. ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తిని గౌరవిస్తూ అభివృద్ధివైపు అడుగులు వేయాలని సూచించారు.

Similar News

News April 9, 2025

ఈనెల 16న జడ్పీ సర్వసభ్య సమావేశం: సీఈవో

image

ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 16వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పీ కార్య నిర్వాహక అధికారి నారాయణమూర్తి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం పదిన్నర గంటలకు జడ్పీ చైర్ పర్సన్ సుభద్ర అధ్యక్షతన సమావేశం జరుగుతుందన్నారు. అన్ని శాఖల అధికారులు సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

News April 9, 2025

విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి: నిర్మల్ డీఈవో

image

ఎస్ఏ 2 పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నిర్మల్ డీఈవో రామారావు సూచించారు. ఈ నెల 9 నుంచి 17 వరకు పరీక్షలను నిర్వహించి పరీక్షా అనంతరం మూల్యాంకనం చేసి మార్కులను రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. ఈ నెల 23న పీటీఎం మీటింగ్ ఏర్పాటు చేసి విద్యార్థుల ఫలితాలను అందజేయాలని ఆదేశించారు.

News April 9, 2025

IPL: తగ్గేదేలే.. విధ్వంసమే

image

గత రెండు రోజుల్లో జరిగిన 3 ఐపీఎల్ థ్రిల్లర్ మ్యాచ్‌లు అభిమానులకు మజానిచ్చాయి. 200కు పైగా పరుగులు చేసి ఆరు జట్లు విజయం కోసం చివరి బంతి వరకు పోరాడాయి. సీనియర్లతో పాటు యంగ్ ప్లేయర్లు తగ్గేదేలే అంటూ బౌలర్లపై విరుచుకుపడ్డారు. మొన్న RCB 221/5 స్కోర్ చేస్తే MI 209/9 పరుగులు చేసింది. నిన్న LSG విసిరిన 239 పరుగుల సవాల్‌కు KKR(234) దీటుగా బదులిచ్చింది. PBKS 219/6 స్కోర్‌ చేస్తే CSK 201/5 రన్స్ చేసింది.

error: Content is protected !!