News April 6, 2025
వరుసగా 3 రోజులు సెలవులు

TG: ప్రభుత్వ/ప్రైవేటు కార్యాలయాలు, పలు విద్యాసంస్థలకు ఈనెల 12 నుంచి 14 వరకు వరుసగా సెలవులు రానున్నాయి. 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా సెలవులు ఉండనున్నాయి. అటు ఈనెల 10న మహావీర్ జయంతి సందర్భంగా ఆప్షనల్ హాలీడే ఉంది. 18న గుడ్ ఫ్రైడే రోజు సెలవు ఉండనుండగా, 30న బసవ జయంతి రోజున ప్రభుత్వం ఆప్షనల్ సెలవుగా పేర్కొంది.
Similar News
News April 9, 2025
ఘోర అగ్ని ప్రమాదం.. 20 మంది మృతి

చైనా హెబీ ప్రావిన్స్‌లోని ఓ నర్సింగ్ హోమ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది చనిపోగా పలువురు గాయపడినట్లు అక్కడి మీడియా తెలిపింది. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఫైర్ యాక్సిడెంట్‌కు గల కారణాలను వెల్లడించలేదు. అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించింది.
News April 9, 2025
3 రోజులపాటు ఆస్పత్రిలోనే మార్క్ శంకర్

సింగపూర్‌లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన Dy.CM పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. రాత్రి ఆస్పత్రికి చేరుకున్న పవన్ పిల్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. ఊపిరితిత్తుల్లో పొగ పట్టేయడం వల్ల తలెత్తే సమస్యలపై పరీక్షలు చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడిని ఎమర్జెన్సీ వార్డు నుంచి సాధారణ గదికి తీసుకొచ్చామన్నారు. మరో 3 రోజులపాటు టెస్టులు చేయాల్సి ఉందని వెల్లడించారు.
News April 9, 2025
RBI వడ్డీ తగ్గించినా బ్యాంకులు తగ్గించట్లేదు

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించట్లేదన్న చందాన బ్యాంకుల తీరు తయారైంది. వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించినా చాలా బ్యాంకులు తగ్గించడం లేదు. దీంతో లోన్లు, EMIలు కట్టేవారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెపో రేటు తగ్గినా సామాన్యులకు వర్తింపజేయాలా? వద్దా? అనేది బ్యాంకులపై ఆధారపడి ఉండటమే వడ్డీ తగ్గకపోవడానికి కారణం. ఆదాయం పెంచుకోవడంలో భాగంగా బ్యాంకులు ఇలా చేస్తుంటాయి. మీకూ ఇలా ఎప్పుడైనా జరిగిందా?