News April 6, 2025

హరీశ్.. నీ లేఖల పురాణం ఆపు: బీర్ల ఐలయ్య

image

హరీశ్ రావును చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదని MLA బీర్ల ఐలయ్య ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆయన రాసిన లేఖపై స్పందిస్తూ.. ‘పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న హరీశ్ ఇప్పుడు సుద్ద పూస మాటలు మాట్లాడుతున్నాడు. రేవంత్ పాలన చేస్తుంటే హరీశ్ రావు లేఖల పేరుతో నీతిమాలిన చర్యలకు పాల్పడుతున్నాడు. రాహుల్ గాంధీకి, KCR కుటుంబానికి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది’ అని ఐలయ్య దుయ్యబట్టారు.

Similar News

News April 9, 2025

నర్సీపట్నంలో అర్ధరాత్రి హత్య

image

నర్సీపట్నం మున్సిపాలిటీ అయ్యన్న కాలనీకి చెందిన ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసింది. మంగళవారం అర్ధరాత్రి ప్రసాద్, మహేశ్ అనే ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వారిని పంపించేశారు. పోలీసులు వెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య మళ్లీ ఘర్షణ జరిగి ప్రసాదును మహేశ్ కత్తితో పొడిచి హత్య చేశాడు. స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు.

News April 9, 2025

ఈనెల 16న జడ్పీ సర్వసభ్య సమావేశం: సీఈవో

image

ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 16వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పీ కార్య నిర్వాహక అధికారి నారాయణమూర్తి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం పదిన్నర గంటలకు జడ్పీ చైర్ పర్సన్ సుభద్ర అధ్యక్షతన సమావేశం జరుగుతుందన్నారు. అన్ని శాఖల అధికారులు సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

News April 9, 2025

విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి: నిర్మల్ డీఈవో

image

ఎస్ఏ 2 పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నిర్మల్ డీఈవో రామారావు సూచించారు. ఈ నెల 9 నుంచి 17 వరకు పరీక్షలను నిర్వహించి పరీక్షా అనంతరం మూల్యాంకనం చేసి మార్కులను రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. ఈ నెల 23న పీటీఎం మీటింగ్ ఏర్పాటు చేసి విద్యార్థుల ఫలితాలను అందజేయాలని ఆదేశించారు.

error: Content is protected !!