News March 26, 2024
వాలంటీర్లకు రూ.50వేలు వచ్చేలా చూస్తా: CBN

ఏపీని కాపాడాలన్న అజెండాతోనే మూడు పార్టీలు కలిసి ప్రజల ముందుకు వస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా యువతతో ఆయన సమావేశమయ్యారు. ‘ఐటీని ప్రోత్సహించి యువతకు కొత్త దారి చూపించా. భవిష్యత్తులో వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తాం. వాలంటీర్లు రూ.30 వేల నుంచి రూ.50వేలు సంపాదించుకునేలా చేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాలంటీర్ల జీవితాలు మారుస్తా’ అని చంద్రబాబు తెలిపారు.
Similar News
News March 13, 2026
పూతలపట్టు: పెట్రోల్ అయిపోవడంతో దొరికిపోయిన దొంగ

పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్‌లో ఓ బైక్ దొంగను స్థానికులు పట్టుకున్నారు. రంగంపేట క్రాస్‌కు చెందిన హరిబాబు ఇంటి ముందు పార్క్ చేసిన బైక్‌ను ఓ వ్యక్తి దొంగతనం చేసి తీసుకెళ్లాడు. వెంటనే సీసీ కెమెరాలు పరిశీలించగా.. పెట్రోల్ అయిపోవడంతో ఆ దొంగ బైక్‌ను తోసుకుంటూ పెట్రోల్ బంకు వైపు వెళ్తున్నట్లు తెలిసింది. వెంటనే స్థానికుల సహాయంతో అతడిని పట్టుకున్నారు. చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు.
News March 13, 2026
ఎక్కువ రేట్లకు సిలిండర్లు అమ్ముతున్నారా.. కాల్ చేయండి.!

గ్యాస్ సిలిండర్లపై అసత్య వార్తలు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని ఎస్పీ తుషార్ డూడీ హెచ్చరించారు. సిలిండర్ల కొరత, ధరలు పెరిగాయని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. అధిక ధరకు సిలిండర్లు విక్రయిస్తే 112 సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలు అధికారిక సమాచారాన్ని విశ్వసించాలన్నారు.
News March 13, 2026
యుద్ధం.. చిత్తూరు జిల్లాలో నూనె ధరల పెంపు

యుద్ధం ప్రభావంతో వంటనూనెల ధరలు మండుతున్నాయి. చిత్తూరు జిల్లాలో బ్రాండెడ్ నూనెలు కిలో ప్యాకెట్‌పై రూ.10 పెంచారు. లూజ్ విక్రయాల్లోనూ లీటరుకు రూ.10 నుంచి రూ.20 వరకు పెంచారని తెలుస్తోంది. జనవరిలో సన్ ఫ్లవర్ ఆయిల్ రిటైల్ ధర రూ.150 ఉండగా, ప్రస్తుతం రూ.170 నుంచి రూ.175కు చేరింది. పామోలిన్ రూ.110 నుంచి రూ.130కి.. వేరుశనగ నూనె రూ.160 నుంచి రూ.175కు పెరిగింది.


