News April 6, 2025
నంచర్ల-గుంతకల్లు మధ్య రైల్వే డబుల్ లైన్

అనంత జిల్లా గుంతకల్లు రైల్వే జంక్షన్ మల్లప్పగేట్ నుంచి కర్నూలు నంచర్ల మధ్య డబుల్ లైన్ నిర్మాణానికి రైల్వే శాఖ అడుగులు పడ్డాయి. గుంతకల్లు రైల్వే జంక్షన్ మల్లప్పగేట్ నుంచి KNL చిప్పగిరి, దౌలతాపురం, నంచర్ల మధ్య ఈ ఆర్‌వో డబుల్ లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం రైతుల నుంచి భూసేకరణ చేయనున్నారు. పత్తికొండ ఆర్టీవో పర్యవేక్షణలో భూసేకరణ చేపడుతున్నట్లు రైల్వే అధికారులు నోటీసులో పేర్కొన్నారు.
Similar News
News April 9, 2025
ఓయూలో 470 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు!

ఉస్మానియా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 601 మంజూరు పోస్టులకు గాను 131 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 470 ఖాళీలు ఉన్నాయి. అకాడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో సగమే భర్తీ చేస్తారని సమాచారం.
News April 9, 2025
గాంధారి: కారు బోల్తా.. యువతి మృతి

గాంధారి మండలం మాధవపల్లి వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చిన్నగుట్ట తండాకు చెందిన అంజలి పూజ(22) మృతి చెందింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నగుట్ట తండాకు చెందిన 5గురు హైదరాబాద్ నుంచి కారులో స్వగ్రామానికి వస్తుండగా మార్గమధ్యంలో అడవిపంది అడ్డువచ్చింది. దీంతో ఒక్కసారిగా కారు బోల్తా కొట్టింది. ఈ ఘటలో అంజలి పూజ మృతి చెందగా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.
News April 9, 2025
చిలకలూరిపేట: విడదల రజిని బెయిల్‌పై తీర్పు రిజర్వ్

మాజీ మంత్రి విడదల రజిని హైకోర్టులో వేసిన ముందస్తు బెయిల్‌పై వాదనలు మంగళవారం ముగిశాయి. తీర్పుని హైకోర్టు రిజర్వ్ చేసింది. అప్పటి అడిగినంత సొమ్ము చెల్లించుకుంటే అంతు చూస్తామని, స్టోన్ క్రషర్‌ను మూసి వేయిస్తామని, క్వారీ యజమానులను బెదిరించారని, (ఏజీ) శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. పిటిషనర్‌లను కస్టడీలోకి తీసుకుని విచారించాలని ముందస్తు బెయిల్ పిటిషన్‌లు కొట్టి వేయాలని కోరారు.